వర్క్ ఫ్రమ్ హోమ్‌లో కొత్త రూల్ ఇదే..
కరోనా వచ్చాక ఐటీ సహా పలు సెక్టార్లలో ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అమల్లోకి తీసుకొచ్చారు. దాదాపు రెండున్నరేళ్లుగా చాలా మంది ఇంటి నుంచే పని చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే కొన్ని కంపెనీలు ఉద్యోగులను ఆఫీస్‌కు రమ్మంటూ ఆహ్వానిస్తోంది. అయితే ఎంప్లాయిస్ మాత్రం "రామంటే రాము" అని తేల్చి చెప్పేస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్‌కు సంబంధించి కొత్త రూల్స్ తీసుకురానుంది. స్పెషల్ ఎకనామిక్ జోన్-SEZయూనిట్ పరిధిలోని ఉద్యోగులు ఏడాది పాటు ఇంటి నుంచి పని చేసుకునేందుకు అనుమతినిచ్చింది. కంపెనీలోని 50% మంది ఉద్యోగులకు ఈ వెసులుబాటు కల్పించవచ్చని స్పష్టం చేసింది. వాణిజ్యశాఖ ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పెషల్ ఎకనామిక్స్ జోన్స్ రూల్స్-2006లోని 43A అనే కొత్త రూల్‌ను చేర్చింది.
ఈ రూల్ ఎందుకు తెచ్చారు..?
దేశవ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్‌కు సంబంధించిన నియమ నిబంధనలు ఒక్కో సెజ్‌లో ఒక్కో విధంగా ఉంటున్నాయి. ఇలా కాకుండా దేశానికంతటికీ కలిపి యూనిఫామ్ పాలసీని తీసుకురావాలని ఇండస్ట్రీ వర్గాలు కేంద్రానికి చాలా కాలంగా విజ్ఞప్తి చేస్తున్నాయి. అందరికీ ఇంటి నుంచి పని చేసుకునే వెసులుబాటు కల్పించలేమన్న కంపెనీలు, రూల్స్‌లో మార్పులు చేయాలని కోరాయి. ఈ వినతులను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం వాణిజ్య శాఖ, ఈ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఓ కంపెనీలోని నిర్దేశిత విభాగానికి చెందిన ఉద్యోగులకు మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేలా చూడాలని తెలిపింది. ఐటీ, సెజ్‌ల పరిధిలోని ఉద్యోగులకు ఈ రూల్ వర్తించనుంది. ఆఫ్‌సైట్‌లో పని చేసే వాళ్లకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. ఒప్పంద ఉద్యోగులతో కలుపుకుని మొత్తం ఎంప్లాయిస్‌లో 50% మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌ను వినియోగించుకోవాలన్నది కొత్త రూల్. "గరిష్ఠంగా ఏడాది పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునేందుకు వీలుంటుంది. తరవాత ఎక్స్‌టెండ్ చేయాలంటే సెజ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ అనుమతి తప్పనిసరి. ఆయన ఒప్పుకుంటే మరో ఏడాది పాటు ఇంటి నుంచి పని చేసుకోవచ్చు" అని వాణిజ్య శాఖ తెలిపింది. ఇప్పటికే సెజ్‌ల పరిధిలో ఉన్న ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఉండి ఉంటే...90 రోజుల్లోగా ఇందుకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. WFHకి అవసరమైన ఎక్విప్‌మెంట్‌ను సెజ్‌లే ప్రొవైడ్ చేయాలని చెప్పింది.
Also Read: Justin Beiber India Tour: దిల్లీలో పాప్ సింగర్ జస్టిన్ బీబర్ కన్సర్ట్, టికెట్ ధరెంతో తెలుసా?