హనీ లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన విషయం తెలుసుకుని సామ్రాట్ పరిగెత్తుకుంటూ వెళతాడు. ఆంటీ నాకు భయమేస్తుంది, కళ్ళు తిరుగుతున్నాయని అంటుంది. ఇక తులసి లిఫ్ట్ దగ్గర కూర్చుని హనీ ఎడవకమ్మ అంకుల్ వస్తున్నారని ధైర్యం చెప్పేందుకు ప్రయత్నిస్తుంది. తులసి అక్కడ ఉండటం చూసి షాక్ అవుతాడు. హనీ హనీ పిలుస్తాడు, నీకేం కాదు నాన్న నేను వచ్చేశానుగా నిన్ను బయటకి తీసుకొచ్చేస్తాను అని అంటాడు. ఇక స్కూల్ ప్రిన్సిపల్ మీద సామ్రాట్ అరుస్తాడు. మా హనీ లోపల ఇరుక్కుంది, పది నిమిషాలు అయ్యింది, ఏం చేస్తున్నారు మీరు , అందరితో పాటు నిలబడి తమాషా చూస్తున్నారా అని అరుస్తాడు. మిమ్మల్ని నమ్మి పాపని స్కూల్ కి పంపిస్తే ఇదేనా మీరు చేసే ఘనకార్యం అని తిడతాడు. అయిన నా మీద అరిస్తే ఏం లాభం సార్, ట్రాన్స్ ఫారం పేలిపోతే అది నా తప్పా, అయిన ఈ టైమ్ కి హి క్లాస్ లో ఉండాలి తులసి గారిని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి లిఫ్ట్ ఎక్కి ఇరుక్కుపోయిందని స్కూల్ ప్రిన్సిపల్ చెప్తుంది. 


సామ్రాట్: నా హనీని బతకనివ్వవా ఎందుకు ఇలా వెంటపడుతున్నావ్. నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు నీ ముందు పడేస్తా, దయచేసి నా పాపని వదిలేయ్. చూడు అది ఎలా ఏడుస్తుందో చూడు. ఇదంతా నీ కారణంగానే. నిన్ను జైల్లో పెట్టించానని నా పాప మీద పగ పట్టావ్ కదా 


తులసి: అర్థం లేకుండా మాట్లాడకండి సర్ నేను పిల్లల తల్లినే నాకు కడుపు తీపి తెలుసు. నేనేం రాక్షసిని కాదు అయిన ఈ సమయంలో హనీని కాపాడుకోవడం ఆపేసి ఏంటి సర్ ఈ అరుపులు గొడవలు. మీరు తప్పుకోండి నేను పాపతో మాట్లాడాలి ధైర్యం చెప్పాలి 


సామ్రాట్: షటప్.. నీ వల్లే నా పాపకి ఇటువంటి పరిస్థితి వచ్చింది. నీ అంతు చూస్తాను నిన్ను చంపేస్తాను అని గట్టిగా అరుస్తాడు. 


Also Read: మాధవ పైశాచికత్వం, నేను మీ నాన్నని కాదని దేవికి నిజం చెప్పిన మాధవ_ షాక్లో రుక్మిణి


సామ్రాట్ వాళ్ళ బాబాయ్ వచ్చి సామ్రాట్ ని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు. ఎందుకు రా పిచ్చోడిలా అరుస్తున్నావ్ అని తిడతాడు. అంతా నీ తులసి వల్లే నువ్వేగా దాన్ని జైల్లో నుంచి బయటకి తీసుకొచ్చావ్ అని అరుస్తాడు. నిజానిజాలు తెలుసుకోకుండా తులసి మీద నోరు పారేసుకోకు, ఈరోజు హనీ ప్రాణాలతో ఉందంటే అది తులసి వల్లే. నిజం ఎంతో నేకు ఇంటికి వెళ్ళాక చెప్తాను, నువ్వు దూరంగా ఉండు తులసి పాపని రక్షిస్తుంది, నీ చేతికి అప్పగిస్తుంది. మాట్లాడకుండా ఉండు అని సర్ధి చెప్తాడు. లిఫ్ట్ మెకానిక్, డాక్టర్ అక్కడికి వస్తారు. 


ఇక హనీ భయపడుతుంటే తులసి నేను చెప్పినట్టు విను తొందరగా బయటకి వస్తావని చెప్తుంది. నీ పక్కనే నేను కూర్చున్న కావాలంటే చూడు నీకేం కాదు అసలు భయపడకు అని చెప్తుంది. హనీ తులసి చెప్పినట్టే చేస్తుంది. కాసేపటికి లిఫ్ట్ బాగుచేయడంతో హనీ బయటకి వచ్చి తులసిని కౌగలించుకుంటుంది. నాకేం భయం లేదు నాన్న ఆంటీ ఉందిగా అని అంటుంది. శ్రుతి ప్రేమ్ కోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది. ప్రేమ్ బాగా తాగి ఇంటికి వస్తాడు. ప్రపంచం మొత్తానికి నిరూపించావ్ కదా పెళ్ళాం సపోర్ట్ లేకుండా నిలబడలేనని ఇంకా సరిపోలేదా అని శ్రుతితో అంటాడు. యనేదుకు అలా మాట్లాడతావ్ నేనేం చేశానని అలా అంటున్నావ్ ప్రేమ్ అని శ్రుతి బాధపడుతుంది. ప్రేమ్ శ్రుతిని నోటికొచ్చినట్టు మాట్లాడతాడు. నీ కన్నీళ్లని నమ్మను, నీ మాటని నమ్మను, ఒక నిజాన్ని దాచి పెట్టడం వల్ల పోయిన నమ్మకం ఆ తర్వాత వెయ్యి నిజాలు చెప్పినా రాదు. మన బంధం మసకబారిపోయింది, నన్ను మోసం చేశావ్ అని అరుస్తాడు. ఆ మాటలకి శ్రుతి గుండెలు పగిలేలా ఏడుస్తుంది. 


Also Read: ఖైలాష్ ని చితక్కొట్టిన యష్, వేదకి క్షమాపణ చెప్పనన్న యష్-తగ్గేదెలే అంటున్న వేద


తరువాయి భాగంలో.. 


ప్రేమ్ నిద్ర లేచేసరికి శ్రుతి ఇంట్లో ఉండదు. ఇక మనం కలిసి ఉండటంలో అర్థం లేదని వెళ్లిపోతున్నాను అని లెటర్ రాసి పెడుతుంది. అది చూసి ప్రేమ్ కన్నీళ్ళు పెట్టుకుంటాడు. తులసి ప్రేమ్ కి ఫోన్ చేసి శ్రుతికి ఇవ్వు మాట్లాడాలి అని అడుగుతుంది. ప్రేమ్ ఫోన్ ఇవ్వడానికి నసుగుతుంటే ఇంట్లో లేదు కదా అని అంటుంది. ఆ మాటకి ప్రేమ్ షాక్ అవుతాడు.