cyber scam ends up owning 4 crore: ఎవరైనా ఫోన్ చేసి మీకు ఉన్నారో లేదో తెలియని బంధువులు మీకు ఆస్తి రాసిచ్చారని.. వచ్చి క్లెయిమ్ చేసుకోమని ఫోన్ చేస్తే ఏమనుకుంటారు.. ఖచ్చితంగా వంద శాతం సైబర్ ఫ్రాడ్ అని నిర్దారించుకుని ఆ ఫోన్ చేసిన వారిని చెడామడా తిట్టేస్తారు. ఏదైనా పని చేసుకుని బతక వచ్చు కదా ఎందుకు ఇలా మోసాలు చేస్తావని మండిపడతారు. కెనడా మహిళ లోరైన్ గెసెల్ కూడా అలాగే చేసింది. కానీ తర్వాత పశ్చాత్తాపపడింది. ఎందుకంటే ఫోన్ చేసింది సైబర్ ఫ్రాడ్ స్టర్ కాదు. ఓ లాయర్.
కెనడాకు చెందిన లోరైన్ గెసెల్ కు ఓ రోజు ఫోన్ కాల్ వచ్చింది. దూరపు చుట్టం అయిన ఓ వ్యక్తి వారసత్వంగా కొంత ఆస్తిని లోరైన్ పేరున రాశారని.. దాని విలువ రూ. నాలుగు కోట్ల విలువ లక్షలు అని చెప్పింది.కానీ ఆమె ఆ కాల్ సైబర్ ఫ్రాడ్ అనుకుంది. కానీ తర్వాత ఆ నెంబర్ చెక్ చేసింది. చివరికి అంతా నిజమేనని అనుకుంది. 2021 లో 85 సంవత్సరాల వయసులో ఒంటరిగా ఓ వ్యక్తి చనిపోయాడు. అతను వివాహం చేసుకోలేదు మరియు పిల్లలు లేనందున అతని ఆస్తిని ఎవరూ క్లెయిమ్ చేసుకోలేదు. దీంతో ఫైండర్స్ ఇంటర్నేషనల్ లో.. ఆస్తి తనకు ఎలా దక్కుతుందో సెర్చ్ చేసుకుంది లోరైన్.
ఇది ఓ అద్భుత కథలా ఉందని లోరైన్ తనను కలిసిన మీడియాకు చెబుతున్నారు. నిజానికి అద్భుతమైన కథే. ఇలాంటివి నూటికో కోటికో ఒక్కటి జరుగుతాయి. అయితే ఇలాంటి కాల్స్ తో మోసగించే వారు ఎక్కువగా ఉన్నారు. కాల్ చేసిన వ్యక్తి ఎలాంటి డబ్బు అడగకపోవడంతో లోరైన్ అది మోసం కాదేమో అనుకుని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఫైండర్స్‌లోని పరిశోధకులు చాలా మంచివారు. వారు నా విస్తృత కుటుంబం గురించి నాకు వివరాలను అందించారని ఆమె ప్రశంసిస్తున్నారు.