IT officials Raids with complete information about Tollywood financial affairs:  తెలుగు చిత్ర పరిశ్రమలోని బడా నిర్మాతల ఇళ్లపై ఐటీ దాడులు చర్చనీయాంశం అవుతున్నాయి. ఐటీ రెయిడ్స్ ఎంత పకడ్బందీగా చేస్తారో సినిమాల్లో చూపిస్తారు. కానీ ఇప్పుడు ఆ నిర్మాతలు స్వయంగా చూస్తున్నారు. రెండు వందల మందికిపైగా అధికారులు ఒక్క సారిగా ఎలాంటి సమాచారం లేకుండా రెయిడ్ కి వచ్చేశారు. దీంతో సర్దుకోవడానిక ికూడా నిర్మాతలకు ఏ అవకాశం లేకుండా పోయింది. ఐటీ అధికారులు సంపూర్ణమైన సమాచారాన్ని సేకరించిన తర్వాతే దాడి చేశారని వారు సోదాలు చేస్తున్న వ్యక్తులను బట్టి అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. 

Continues below advertisement


భారీగా ఆర్థిక లావాదేవీలు నిర్వహించే వారి గుట్టు తెలుసుకుని రెయిడ్స్      


రామ్ చరణ్‌తో బుచ్చిబాబు సానా దర్శకత్వంలో సినిమా చేస్తున్న నిర్మాత సతీష్ గురించి బయట పెద్దగా తెలియదు. కానీ ఆయన బడా ఆర్థిక వ్యవహారాలను నడుపుతూ ఉంటారని ఆయనకు రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా ఉందని ఇండస్ట్రీలో కొంత మందికి తెలుసు. మైత్రీ మూవీకమ్స్ లో ఆయన ఓ పార్టనల్. ఆయన ఇంటిపై కూడా ఐటీ రెయిడ్స్ జరుగుతున్నాయి. ఇక పెద్దగా సినిమాలు తీయని..డిజిటల్ సినిమా కంటెంట్ క్రియేషన్ లో ఉన్న మ్యాంగో మీడియా యజమాని రాము ఇంట్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయన దిల్ రాజు కు పెద్ద మొత్తంలో నగదు సమకూరుస్తారన్న ప్రచారం ఉంది. అలాగే సినీ ఇండస్ట్రీలో పెద్ద ఫైనాన్షియర్ గా ఉన్న సత్య రంగయ్య ఆపీసుల్లోనూ సోదాలు చేస్తున్నారు.            


దిల్ రాజు భార్యను బ్యాంకుకు తీసుకెళ్లిన ఐటీ అధికారులు         


అంటే టాలీవుడ్ కు సంబంధించి పూర్తి స్థాయిలో .. ఆర్థిక పరమైన లావాదేవీలు ఎలా జరుగుతాయో తెలుసుకున్న తర్వాతనే అతి భారీ ఆపరేషన్ ను ఐటీ అధికారులు ప్రారంభించారని అనుకోవచ్చు. సోదాలు ఆషామాషీగా జరగడం లేదని .. దిల్ రాజు ఇంట్లో నిర్వహిస్తున్న సోదాలతో వెల్లడవుతోంది. దిల్ రాజు భార్యను ప్రత్యేకంగా బ్యాంకుకు తీసుకెళ్లారు. లాకర్లలో ఏముందో పరిశీలించే అవకాశం ఉంది.  పుష్ప సినమా అత్యధిక కలెక్షన్లను వసూలు చేసింది. వీరంతా పన్నులు కట్టకుండా నగదు లావాదేవీలు నిర్వహిస్తున్నారన్న అనుమానాలతో  ఐటీ రెయిడ్స్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.           


టాలీవుడ్ లో బ్లాక్ మనీ గుట్టు అంతా బయటకు వస్తుందా ?      


సాధారణంగా సినిమా రంగం అంటే బ్లాక్ మనీ ఎక్కువగా ఉంటుందని అనుకుంటారు. నగదు వ్యవహారాలు జరుగుతాయని అనుకుంటారు. అలాంటి వాటికి చోటు లేకుండా.. ఐటీ దాడులు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఎవరెవరి వద్ద ఎంతెంత లభిస్తాయన్న విషయాన్ని ఐటీ అధికారులు సోదాలు పూర్తి అయిన తర్వాత ప్రకటించే అవకాశం ఉంది. బడా నిర్మాతలపై ఐటీ దాడులు జరుగుతూండటంతో.. ఇతర నిర్మాతలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 


Also Readరాజా వారు రాణి గారు... తల్లిదండ్రులు కాబోతున్నారు - గుడ్ న్యూస్ చెప్పిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం