Hero Kiran Abbavaram and Rahasya Gorak to become parents very soon: యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) గుడ్ న్యూస్ షేర్ చేశారు. తాను తండ్రి కాబోతున్న విషయాన్ని ఆయన వెల్లడించారు. తన భార్య రహస్య గోరఖ్ (Rahasya Gorak)తో కలిసి దిగిన ఫోటో షేర్ చేశారు. ఆ ఫోటోలో ఆవిడ బేబీ బంప్ చాలా స్పష్టంగా కనబడుతోంది.
రాజా వారు రాణి గారు...
తల్లిదండ్రులు కాబోతున్నారు!
తెలుగు చిత్ర పరిశ్రమకు కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా పరిచయమైన సినిమా రాజా వారు రాణి గారు. అందులో కథానాయికగా నటించిన అమ్మాయి రహస్య గోరఖ్. కలిసి తొలి సినిమా చేయడమే కాదు... ఆ సినిమా చిత్రీకరణలో జరిగిన పరిచయం వాళ్ళిద్దరి మధ్య ప్రేమకు దారి తీసింది. ఆ తర్వాత పెళ్లి పీటల మీద కూర్చునేలా చేసింది.
గత ఏడాది (2024లో) మార్చి 31న కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ నిశ్చితార్థం జరిగింది. కుటుంబ సభ్యులు, కొంత మంది సన్నిహితులు శ్రేయోభిలాషుల సమక్షంలో కర్ణాటకలోని కూర్గ్ ప్రాంతంలో ఆగస్టు 22న పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు రహస్య ప్రెగ్నెన్సీ విషయాన్ని అనౌన్స్ చేశారు. 'మా ప్రేమ రెండు అడుగులు పెరిగింది' అని కిరణ్ అబ్బవరం పేర్కొన్నారు.
Also Read: 'మంజుమ్మెల్ బాయ్స్' యాక్టర్ దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా...
పెళ్లి తర్వాత కిరణ్ జీవితంలో విజయాలు!
రహస్యతో వివాహం తర్వాత కిరణ్ అబ్బవరం జీవితంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. పెళ్లి చేసుకోవడానికి ముందు అతను యాక్సెప్ట్ చేసిన 'రూల్స్ రంజన్' ఫ్లాప్ అయినప్పటికీ... ఫాంటసీ సస్పెన్స్ థ్రిల్లర్ 'క'తో భారీ విజయం అందుకున్నారు. ఈ చిత్రానికి కిరణ్ భార్య రహస్య నిర్మాణపరమైన విషయాలలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
రహస్యత వివాహమైన తర్వాత కిరణ్ అబ్బవరం ఒక నిర్మాణ సంస్థ స్థాపించారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా కొత్త తరహా కథలతో రూపొందే సినిమాలను నిర్మించాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా కిరణ్ అబ్బవరం నటించిన డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఫిల్మ్ 'దిల్ రూబ' థియేటర్లలోకి రానుంది.
పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత 'రూల్స్ రంజన్'... కిరణ్ అబ్బవరం చేసిన కొన్ని సినిమాలు ఆశించిన విజయాలు సాధించలేదు. ఎక్కడ లోపం జరుగుతుందో తెలుసుకోవడానికి కాస్త గ్యాప్ తీసుకున్న హీరో, ఆ తర్వాత తన రూట్ మార్చారు. డిఫరెంట్ కాన్సెప్ట్ లేదా డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఉన్న సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యారు. అలా చేసిన 'క' మంచి హిట్ అందించింది.
Also Read: టీవీ సీరియల్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయ్... ఫస్ట్ ప్లేస్ ఎవరిది? టాప్ 10లో ఏవేవి ఉన్నాయో తెలుసా?