'మంజుమ్మెల్ బాయ్స్'... పాన్ ఇండియా స్థాయిలో సూపర్ సక్సెస్ సాధించడమే కాదు, రూ. 100 కోట్ల క్లబ్బులో చేరిన మలయాళ సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఆ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన నటుడు ఒకరు దర్శక నిర్మాత కూడా! ఇప్పుడు ఆయనతో దుల్కర్ సల్మాన్ ఒక సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు.
సౌబిన్ షాహిర్ దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్!సౌబిన్ షాహిర్ (Soubin Shahir)... బహుశా ఈ పేరు చెబితే తెలుగు ప్రేక్షకులు గుర్తు పట్టడం కొంచెం కష్టం కావచ్చు. కానీ, ఆయన ఫోటో చూస్తే ఈజీగా గుర్తు పడతారు. మలయాళ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. 'మంజుమ్మెల్ బాయ్స్'లో ప్రధాన పాత్ర పోషించడమే కాదు... ఆ సినిమా నిర్మాణంలోనూ ఆయన భాగస్వామి. ఇప్పుడు అతని దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ఒక సినిమా చేయనున్నారు.
దర్శకుడిగా ఒక సినిమా తీసిన అనుభవం సౌబిన్ షాహిర్ (Soubin Shahir to direct Dulquer Salmaan)కు ఉంది. ఆల్మోస్ట్ 8 ఏళ్ల క్రితం... 2017లో దర్శకుడుగా 'పర్వ' సినిమా తీశారు సౌబిన్ షాహిర్. మళ్లీ ఇప్పుడు ఆయన మెగా ఫోన్ పట్టడానికి రెడీ అయ్యారు. ఇటీవల మలయాళ మీడియాతో దుల్కర్ సల్మాన్ హీరోగా తన దర్శకత్వం సినిమా చేస్తున్నట్లు సౌబిన్ షాహిర్ కన్ఫర్మ్ చేశారు.
Also Read: నేను ఒక్కడినే వస్తా.. నువ్వు పంచదార పక్కన పెట్టిరా.. అన్నయ్య విష్ణుకు మంచు మనోజ్ సవాల్
దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన 'చార్లీ', 'కామ్రేడ్ ఇన్ అమెరికా', 'సోలో', 'కింగ్ ఆఫ్ కోత' తదితర సినిమాలలో సౌబిన్ షాహిర్ నటించారు. ఇప్పుడు దుల్కర్ హీరోగా సినిమా చేయనున్నారు. అన్నట్టు... సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజు దర్శకత్వం వహిస్తున్న 'కూలి' సినిమాలో సౌబిన్ షాహిర్ నటిస్తున్నారు.
Also Read: టీవీ ఇండస్ట్రీలో ఘోర విషాదం... ట్రక్కు ఢీ కొట్టడంతో 22 ఏళ్ల నటుడు మృతి
దుల్కర్ సల్మాన్ మాలీవుడ్ హీరో. సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడిగా మలయాళ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. అతి తక్కువ సమయంలో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ పాన్ ఇండియా ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. కొత్త కథలకు, కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చే ఆయన పాన్ ఇండియా సక్సెస్ సాధించిన 'మంజుమ్మెల్ బాయ్స్' నటుడు సౌబిన్ షాహిర్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఓకే అన్నారు.