Jaabilamma Neeku Antha Kopama Release Date Announced: తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ ఈ మధ్య నటనతో పాటు దర్శకత్వంపై కూడా ఫోకస్‌ పెడుతున్నారు. ఇప్పటికే నటుడిగా, సింగర్‌గా కోలీవుడ్‌లో ప్రత్యేకమైన ఇమేజ్‌ సంపాదించుకున్న ధనుష్‌ దర్శకుడిగానూ సక్సెస్ అందుకుంటున్నాడు. ఇటీవల ఆయన నటించడంతో పాటు దర్శకుడిగా తెరకెక్కించిన 'రాయన్‌' సినిమా భారీ విజయం సాధించింది. దీంతో వరుసగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆయన హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహిస్తున్న 'ఇడ్లీ కడై' షూటింగ్‌ జరుగుతోంది. ఏప్రిల్‌ 10న ఈ సినిమాను రిలీజ్‌ చేస్తామని ఇటీవల మూవీ టీం ప్రకటించింది. దానికంటే ముందు ధనుష తన దర్శకత్వంలో ఓ రొమాంటిక్‌ మూవీతో ఆడియన్స్‌ని అలరించబోతున్నాడు.


యువ నటీనటులతో ధనుష్ దర్శకత్వం వహించిన 'నిలవకు ఎన్మేల్‌ ఎన్నాడి కోబం'కు తెలుగులో 'జాబిలమ్మ నీకు అంత కోపమా' టైటిల్ ఖరారు చేశారు. ఫిబ్రవరి 7న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నట్టు ఇప్పటికే మూవీ టీం ప్రకటించింది. అయితే తాజాగా ఈ సినిమాను రిలీజ్‌ వాయిదా పడింది.  కోలీవుడ్‌ ఇండస్ట్రీలో తీసుకువచ్చిన కొన్ని మార్పుల కారణంగా 'నిలవకు ఎన్మేల్‌ ఎన్నాడి కోబం'ను వాయిదా వేస్తున్నట్టు మూవీ టీం వెల్లడించింది. ఈ మేరకు ధనుష్‌ కొత్త రిలీజ్ డేట్‌ని ప్రకటించారు. ఫిబ్రవరి 21న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నట్టు ప్రకటించారు. కాగా యంగ్‌ సెన్సేషన్‌ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌, అనిఖ సురేంద్రన్‌, మథ్యూ థామస్‌, వెంకటేష్‌ మీనన్‌, రబియా కతూన్‌, రమ్య రంగనాత్‌ వంటి నటీనటులు ప్రధాన పాత్రల్లో ఈ సినిమాను రూపొందుతుంది. 


ఫిబ్రవరి 7న కాదు... ఫిబ్రవరి 21న


కాగా రొమాంటి లవస్టోరిగా వస్తున్న ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు పెరిగిపోయాయి. ఇటీవల విడుదలైన గొల్డెన్‌ స్పారో సాంగ్‌ యూట్యూబ్‌ని ఓ ఊపు ఊపింది. యువతను బాగా ఆకట్టున్న ఈ పాటలో ప్రియాంక ఆరుళ్‌ మోహన్‌ స్పెషల్‌ అప్పియరెన్స్‌ ఇచ్చింది. ఈ పాటలో చిత్రంపై మంచి బజ్‌ క్రియేట్‌ అయ్యింది. ప్రస్తుతం నిర్మాంతర కార్యక్రమాలతో పాటు షూటింగ్‌ని జరుపుకుంటున్న ఈ చిత్రం ఫిబ్రవరి 21న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్ కానుంది. తెలుగు జాబిలమ్మా నీకు అంత కోపమా అనే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. కస్తూరి రాజా, విజయలక్ష్మి కస్తూరిరాజా సమర్పణలో ఉండర్‌బార్‌ ఫిలిమ్స్‌ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌ సంగీతం అందిస్తున్నారు. 


Also Read: ఒక్కడినే వస్తా, నువ్వు ఎవరితో వస్తావో రా... అన్నయ్య విష్ణుకు మంచు మనోజ్ సవాల్






తెలుగులో కుబేర


ధనుష్‌ ఓ వైపు తన స్వీయ దర్శకత్వంలో నటిస్తూనే మరోవైపు తెలుగు సినిమా డైరెక్టర్‌ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్‌ తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రాల్లో కుబేర ఒకటి. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో ధనుష్‌, నాగార్జునలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్‌. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్‌ పోస్టర్స్‌, గ్లింప్స్‌ మూవీపై హైప్‌ క్రియేట్‌ చేశాయి. ముఖ్యంగా ధనుష్‌ లుక్‌ ఆసక్తిని కలిగిస్తుంది. అలాగే నాగార్జున పాత్రపై కూడా అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం షూటింగ్‌ని శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాను జూన్‌లో రిలీజ్‌ చేసేందుకు మూవీ టీం ప్లాన్‌ చేస్తుంది. 


Also Readటీవీ ఇండస్ట్రీలో ఘోర విషాదం... ట్రక్కు ఢీ కొట్టడంతో 22 ఏళ్ల నటుడు మృతి