Karnataka High Court : భార్య భర్తల మధ్య అనేక సమస్యలు వస్తాయి. అందులో లావుగా ఉండటం.. నల్లగా ఉండటం లాంటి సమస్యలు కూడా ఉంటాయి. తాజాగా ఇలాంటి ఓ సమస్యతో ఓ జంట కోర్టుకు ఎక్కింది. కోర్టు ఈ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
అభివృద్ధి చెందిన దేశంగా భారత్ - అమృత్ కాల్ తో స్పష్టంగా దేశ భవిష్యత్ లక్ష్యాలు
కర్ణాటకలో భర్త నల్లగా ఉన్నాడని ఓ భార్య వేధించింది. దీనిపై ఆ భర్త కోర్టుకెక్కాడు. ఆ కేసులో కర్నాటక హైకోర్టు విడాకులు మంజూరీ చేసింది. నల్లగా ఉన్నాడని భర్తను వేధించడం క్రూరత్వమే అవుతుందని కోర్టు తన తీర్పులో పేర్కొన్నది. నల్లగా ఉన్నాడని పదేపదే వేధించడం వల్లే భర్త తన భార్యను విడిచివెళ్లాల్సి వచ్చిందని కోర్టు తెలిపింది. అయితే తన వేధింపులను కప్పిపుచ్చేందుకు భర్తపై భార్య లేనిపోని ఆరోపణలు చేసినట్లు కూడా కోర్టు పేర్కొన్నది. భర్తపై అక్రమ సంబంధం ఆరోపణలు కూడా చేసినట్లు తెలిపింది.
బెంగుళూరుకు చెందిన ఆ జంట 2007లో పెళ్లి చేసుకున్నది. వాళ్లకు ఓ అమ్మాయి పుట్టింది. అయితే 2012లో విడాకులు కావాలని ఫ్యామిలీ కోర్టును భర్త ఆశ్రయించాడు. ఆ కేసులో జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ అనంత రామనాథ్ హెగ్డేలతో కూడిన ధర్మాసనం తీర్పును ఇచ్చింది. కేవలం కూతురి కోసం భర్త ఆ అవమానాలు భరించినట్లు కోర్టు తెలిపింది. అయితే భర్తే తనను వేధించినట్లు భార్య గృహహిం కేసు పెట్టినా.. ఆ కేసు పూర్వపరాలు పరిశీలించిన కోర్టు ఆమె వాదనను తిరస్కరించింది. భర్తతో కలిసి ఉండేందుకు భార్య రాలేదని, ఆ వైవాహిక బంధంలో కొనసాగేందుకు ఆమెకు ఇష్టం లేదన్న విషయాన్ని గ్రహించామని, అందుకే ఆ జంటకు విడాకులు మంజూరీ చేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది.
మేరీ మాటీ మేరా దేశ్ - ప్రధాని మోదీ శ్రీకారం చుట్టిన ఈ ప్రచారం ఏమిటి! విశేషాలు ఇవీ
తన తప్పు లేదని చెప్పడానికి భార్య .. భర్తపై అక్రమ సంబంధం ఆరోపణలు చేయడం క్రూరత్వమేనని కోర్టు స్పష్టం చేసంది. అక్రమ రీతిలో భర్తపై ఆరోపణలు చేసిన భార్య.. క్రూరత్వానికి పాల్పడినట్లే అని కోర్టు వెల్లడించింది. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13(ఐ)(ఏ) ప్రకారం ఆ జంటకు విడాకులు జారీ చేశారు. ఈ కేసులో న్యాయస్థానం తీర్పు హాట్ టాపిక్ గామారింది.