Keir Starmer To Be UK PM: యూకే ఎన్నికల్లో రిషి సునాక్‌ కన్జర్వేటివ్ పార్టీ ఓటమి చవి (UK Election Results 2024) చూడాల్సి వచ్చింది. ప్రత్యర్థి లేబర్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి రానుంది. ఆ ఆ పార్టీ తరపున పీఎం రేసులో ఉన్న కీర్ స్టార్మర్‌ త్వరలోనే ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకోనున్నారు. బ్రిటన్‌కి పూర్వ వైభవం తీసుకొస్తానని చాలా ధీమాగా చెబుతున్నారు స్టార్మర్. ఈ విజయంతో ఓ రికార్డునీ సొంతం చేసుకున్నారాయన. బ్రిటన్ చరిత్రలో ఇప్పటి వరకూ 60 ఏళ్లు పైబడిన వ్యక్తి ప్రధానిగా బాధ్యతలు చేపట్టలేదు. కానీ...61 ఏళ్ల కీర్ స్టార్మర్‌ ఈ చరిత్రను (Who is Keir Starmer) తిరగరాశారు. 9 ఏళ్ల క్రితం తొలిసారి ఎంపీగా ఎన్నికై ఇప్పుడు ఏకంగా ప్రధాని స్థాయికి ఎదిగారు. లేబర్ పార్టీలో సీనియర్‌ నేత అయిన స్టార్మర్‌ గతంలో న్యాయవాదిగా పని చేశారు. మానవ హక్కుల లాయర్‌గా పని చేసిన ఆయన రాజకీయాల పట్ల తన ఐడియాలజీ చాలా అందరి కన్నా భిన్నంగా ఉంటుందని ప్రచారం చేసుకున్నారు. రాజకీయాలను సేవకు వేదికగా మార్చాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. కేవలం ఐడియాలజీ ఉండడమే కాకుండా అది ప్రాక్టికల్‌గా ఎంత వరకూ వర్కౌట్ అవుతుందన్నదీ తనకో అంచనా ఉంటుందని చాలా ధీమాగా చెప్పారు స్టార్మర్. దాదాపు 14 ఏళ్లుగా కన్జర్వేటివ్ పార్టీ వల్ల బ్రిటన్‌కి ఎంతో నష్టం జరిగిందని, ఈ తప్పుల్ని సరి చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. "కంట్రీ ఫస్ట్, పార్టీ లేటర్" అనే నినాదాన్నీ వినిపించారు.





 
స్టార్మర్‌ని అవకాశవాది అని కొందరు (Keir Starmer Profile) విమర్శిస్తుంటారు. కానీ ఆయన మాత్రం అదంతా లెక్క చేయకుండా తన స్టైల్‌లో తాను పని చేసుకుంటూ పోతారు. అయితే..ఏదైనా తన అభిప్రాయాలను పదేపదే మార్చే అలవాటు ఆయనకు ఉందని, పరిపాలనపైన ఓ స్పష్టమైన విజన్ లేదని వాదిస్తున్న వాళ్లూ ఉన్నారు. ఈ వాదనలు ఎలా ఉన్నా పొలిటికల్‌గా ఈ స్థాయికి ఎదగడానికి చాలానే శ్రమించారు కీర్ స్టార్మర్. గతంలో ప్రజల ముందుకు రావడమంటేనే ఇష్టపడని ఆయన తరవాత తన వైఖరి మార్చుకున్నారు. ఎంత పనిలో బిజీగా ఉన్నా సరే ఫ్యామిలీతో మాత్రం కచ్చితంగా సమయం గడుపుతారు స్టార్మర్. ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటల తరవాత పనిని పక్కన పెట్టేస్తారు. భార్య, ఇద్దరు పిల్లలకే ఆ టైమ్‌ అంతా కేటాయిస్తారు. స్టార్మర్‌కి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. వయోలిన్ నేర్చుకున్నారు కూడా. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో చదువుకున్నారు. 


Also Read: Sudha Murty: వేల కోట్ల ఆస్తి ఉన్నా ఒక్క చీర కూడా కొనని సుధామూర్తి, షాపింగ్ చేసి 30 ఏళ్లైందట - కారణమేంటో తెలుసా?