shruti haasan fires on netizen: తరచూ స్టార్స్‌ తమ ఫ్యాన్స్‌తో సోషల్‌ మీడియా వేదికగా ఇంటారాక్ట్‌ అవుతుంటారు. ఈ విషయంలో టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత, నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా, శృతి హాసన్, రకుల్‌ ఇలా పలువురు హీరోయిన్‌ ఎక్కువగా ఇంట్రెస్ట్‌ చూపిస్తుంటారు. ఈ క్రమంలో వారికి నెటిజన్ల నుంచి రకరకాల ప్రశ్నలు ఎదురవుతుంటాయి. అందులో కొన్ని సరదగా ఉంటాయి.. మరికొన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటాయి. ఆ సమయంలో తెలివిగా వ్యవహరించి ప్రశ్నలను దాటేస్తుంటారు.


రీసెంట్‌గా ఫ్యాన్స్‌తో ఇంటారాక్ట్‌ అయిన రకుల్‌ షాకింగ్‌ ప్రశ్న ఎదురైంది. ఆల్రెడీ పెళ్లైన తనని పెళ్లెప్పుడు అని ప్రశ్నించి ఆమెకు షాకిచ్చాడు. దీనికి కంగుతిన్న రకుల్‌.. ఎన్నిసార్లు పెళ్లి చేసుకోవాలని అంటూ ఫన్నీ రిప్లై ఇచ్చింది. అయితే తాజాగా హీరోయిన్‌ శృతి హాసన్‌కి కూడా ఇబ్బందికర ప్రశ్న ఎదురైంది. సోషల్‌ మీడియాలో ఆస్క్‌ మీ ఎనిథింగ్‌ పేరుతో ఫ్యాన్స్‌తో చిట్‌ చాట్‌ సెషన్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమెకు రకరకాల ప్రశ్నలు ఎదురయ్యాయి. ఒక నెటిజన్‌ 'ప్రేమకు అర్థం' చెప్పమని కోరారు. దీనికి శృతి.. "ప్రేమ అనేది ఒక అద్భుతమైన భావన. మన జీవితాన్ని నడిపించేది ప్రమే. ప్రతి ఒక్కరుకూడా తాము చేసే పనని ప్రేమించండి" అంటూ చెప్పుకొచ్చింది. 


మరో నెటిజన్‌ మీ పెళ్లేప్పుడు..? అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కాస్తా అసహనం చూపించింది శృతి. కానీ,‘నేను చేసుకోనుసార్‌’ అంటూ ఫన్నీగా  రిైప్లె ఇచ్చేసింది నెటిజన్‌కి. ఆ తర్వాత ఓ ఫ్యాన్స్‌ ఏకంగా మీకు కాబోయే వాడు ఎలా ఉండాలి అని అనుకుంటున్నారని అడిగారు. "ఇది 2024.. దయచేసి అమ్మాయిలను ఇలాంటి చెత్త ప్రశ్నలు అడగడం మానేయండి. ఇలాంటివి వింటుంటే చాలా సిల్లీగా అనిపిస్తుంటాయి. అమ్మాయిలకు ఏవి సంతోషాన్ని ఇస్తాయో స్వేచ్ఛగా వారిని ఆ పనులు చేసుకోనివ్వండి" అంటూ ఘాటుగా సమధానం ఇచ్చింది. ఇలా కాబోయే వాడి గురించి అడగ్గానే శృతి స్పందించిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కాగా ఇటీవల శృతి తన బాయ్‌ఫ్రెండ్‌ శాంతాను హజరికాతో బ్రేకప్‌ చెప్పిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా శాంతానుతో శృతి డేటింగ్‌లో ఉంది. ముంబైలో వీరిద్దరు కలిసి నివసిస్తూ సహజీవనం కూడా చేశారు. 



శాంతానుతో రిలేషన్‌లో ఉన్నట్టు లాక్‌డౌన్‌లో వెల్లడించింది శృతి. అప్పటి ప్రియుడితో క్లోజ్‌గా ఉన్న ఫోటోలు షేర్‌ చేస్తూ తరచూ అతడిపై ప్రేమ కురిపించేది. అలా నాలుగేళ్లకు పైగా సహాజీవనం చేసిన వారిద్దరు విడిపోవడం అందరిని షాక్‌ గురి చేసింది. ప్రస్తుతం శృతి హాసన్ బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలతో బిజీగా ఉంది. చివరిగా ఆమె సలార్‌ చిత్రంలో నటించింది. ప్రశాంత్‌ నీల్‌-ప్రభాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ పాన్‌ ఇండియా చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించింది. ఈ సినిమాతో లాంగ్‌ గ్యాప్‌ తర్వాత శృతికి భారీ హిట్‌ పడింది. ప్రస్తుతం సలార్‌ 2 షూటింగ్‌తో బిజీగా ఉంది. మరోవైపు తమిళంలోనూ పలు చిత్రాలతో బిజీగా ఉంది. 


Also Read: 'ఇండియన్ 2' సెన్సార్ పూర్తి.. కమల్ సినిమా రన్ టైమ్ ఎంతంటే?