'Moye Moye' Viral Song:
మోయె మోయె ఫివర్..
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో తెలియదు. కొద్ది రోజుల పాటు ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ని ఊపేసి ఆ తరవాత ఆ ట్రెండ్ పోయి మరో ట్రెండ్ వచ్చేస్తుంది. ప్రస్తుతం ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో చూసినా Moye Moye పాట మారు మోగుతోంది. TikTokలో వైరల్ అయిన ఈ సాంగ్ (What is Moye Moye) ఇప్పుడు అన్ని చోట్లా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. వైరల్ అయిన పాటల్ని యూజర్స్ వదులుతారా...? వాటితో రకరకాల మీమ్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. కొందరు రీల్స్, షార్ట్స్ చేసి వైరల్ అయిపోతున్నారు. యూట్యూబ్‌లో ఈ పాట ట్రెండింగ్ లిస్ట్‌లో (Moye Moye Trending) నంబర్ వన్ ప్లేస్‌లో ఉంది ఉంది. నిజానికి ఇది Moye Moye కాదు. Moye More అసలు పాట పేరు. కానీ...అంతా మోయే మోయే అని ప్రనౌన్స్ చేస్తున్నారు. ఈ పాటలో ఉన్న బీట్, ఈ హుక్ వర్డ్స్ అందరికీ తెగ నచ్చేశాయి. ఈ సెర్బియన్ ట్యూన్ (Serbian Tune Moye Moye) ఏ మాత్రం అర్థం కాకపోయినప్పటికీ అంతా మోయే మోయే అంటూ పాడేసుకుంటున్నారు. భాషతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతోందీ పాట. ఈ సాంగ్ అఫీషియల్ టైటిల్ Dzanum.కానీ మోయే మోయేగానే ఎక్కువగా ఫేమస్ అయింది. పాట డ్యూరేషన్ 2 నిముషాల 44 సెకన్లే. కానీ ఇది క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మాత్రం మామూలుగా లేదు. సెర్బియన్ సింగర్ తెయా దొర (Teya Dora) స్వయంగా రాసి ఆమే పాడారు. మ్యూజిక్ వీడియోలోనూ ఆమె కనిపించారు. సెర్బియన్ ర్యాపర్ స్లోబోదన్ వెల్కోవిక్ కోబి (Slobodan Velkovic Coby)తో కలిసి ఈ పాట రాశారు తెయా.
ఇంతకీ పాటలో ఏముంది..?
పాటలోని భాష, భావం అర్థం కాకపోయినా అంత మంది కనెక్ట్ అవ్వడానికి కారణం ట్యూన్. ఆమె పాడిన తీరు. పైగా అదో విషాద గీతం అని అర్థమవుతోంది. ఈ ఎమోషన్‌కే ఫిదా అయ్యారు. అనుకున్నవి అనుకున్నట్టుగా జరగకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో..చెబుతూనే ఫ్యూచర్ బాగుంటుందన్న కాస్తంత ఆశ కూడా ఈ పాట థీమ్‌లో జోడించారు తెయా దొర. ఇదే అందరినీ ఇంప్రెస్ చేసింది. ఇప్పటి వరకూ ఈ Dzanum Music Video కి 57 మిలియన్ వ్యూస్ వచ్చాయి. తన పాట వైరల్ అవడంపై స్పందించారు తెయా. సోషల్ మీడియాలో అందరికీ థాంక్స్ చెబుతూ పోస్ట్‌లు పెట్టారు. సెర్బియా భాషలో Moye More అంటే పీడకల అని అర్థం. ఒంటరితనం, బాధ, ఒత్తిడి ఇలా అన్ని ఎమోషన్స్ ఈ పాటలోని లిరిక్స్‌లో ఉన్నాయి.
ఎవరీ తెయా దొర..?
తెయా దొర అసలు పేరు తెయాదొర పావ్లోవ్‌స్కా (Teodora Pavlovska). సెర్బియాలో చాలా ఫేమస్ సింగర్. సాంగ్ రైటర్ కూడా. 1992లో సెర్బియాలోని బొర్ ప్రాంతంలో జన్మించారు. అక్కడి నుంచి బెల్గ్రేడ్‌కి షిఫ్ట్ అయింది. మ్యూజిక్‌పై ఉన్న ఇంట్రెస్ట్‌తో అమెరికాలోని బోస్టన్‌లో ఉన్న Berklee College of Music లో చేరింది. కంపోజర్‌గానే మ్యూజికల్ జర్నీ స్టార్ట్ చేసింది. 2019లో తొలి ఆల్బమ్ రిలీజ్ చేసింది. అప్పటి నుంచి సెన్సేషన్స్ క్రియేట్ చేస్తూనే ఉంది.
Also Read: నేవీ మాజీ అధికారులకు ఉరిశిక్ష వేయడంపై ఖతార్‌కి కేంద్రం అప్పీల్, త్వరలోనే విచారణ