Indian Navy Officers: 


8 మందికి మరణ శిక్ష..


8 మంది ఇండియన్ నేవీ మాజీ అధికారులకు ఖతార్ ప్రభుత్వం (Qatar News) ఉరిశిక్ష విధిస్తూ ఇటీవల సంచలన నిర్ణయం తీసుకుంది. దీనిపై భారత్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయాన్ని ఖండిస్తూ ఖతార్‌కి అప్పీల్ చేసింది. ఈ అప్పీల్‌ని అంగీకరించిన ఖతార్ ప్రభుత్వం త్వరలోనే దీనిపై మరోసారి విచారణ చేపట్టనుంది. గత నెల ఈ శిక్ష విధిస్తూ అక్కడి (Indian Navy Officers Death Sentence) కోర్టు తీర్పునిచ్చింది. ఖతార్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ గతేడాది ఆగస్ట్‌లో 8 మంది ఇండియన్ నేవీకి చెందిన మాజీ అధికారులను అరెస్ట్ చేసింది. కీలకమైన వివరాలను రహస్యంగా వేరే దేశాలకు పంపుతున్నట్టు ఆరోపించింది. గూఢచర్యం కింద అదుపులోకి తీసుకుని జైల్లో పెట్టింది. చాలా సార్లు బెయిల్‌ కోసం అప్లై చేసుకున్నప్పటికీ వాటిని కోర్టు తిప్పి పంపింది. గత నెల తుది తీర్పు ఇచ్చింది. అప్పటి నుంచి ఖతార్‌తో సంప్రదింపులు జరుపుతోంది భారత్. ఆ 8 మందిని విడిపించి భారత్‌కి సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే ఖతార్‌కి అప్పీల్ చేసుకుంది. వీళ్లందరూ నేవీలో దాదాపు 20 ఏళ్ల పాటు సేవలందించారు. అందరూ కీలక బాధ్యతలు చేపట్టారు. అలాంటి వాళ్లకు మరణశిక్ష విధించడం సంచలనమైంది. ఈ శిక్ష పడిన వాళ్లలో ఓ అధికారి కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని సాయం కోరారు. ఎలాగైనా కాపాడాలని వేడుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చొరవ చూపించాలని ట్విటర్‌లో పోస్ట్‌లు కూడా పెట్టారు. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, అమిత్‌షాని ట్యాగ్ చేశారు. ఈ ట్వీట్‌ని పరిగణనలోకి తీసుకున్న కేంద్రం వెంటనే ఖతార్‌తో సంప్రదింపులు జరిపి అప్పీల్ చేసింది. 


ఇదీ జరిగింది..


2022 ఆగస్టులో 8 మంది ఇండియన్ నేవీ మాజీ అధికారులు ఖతార్‌లో అరెస్ట్ అయ్యారు. వీరిలో కమాండర్ పూర్ణేందు తివారి, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ అమిత్‌ నాగ్‌పాల్, కమాండర్ సంజీవ్ గుప్తా, కేప్టెన్ నవ్‌తేజ్ సింగ్ గిల్, కేప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కేప్టెన్ సౌరభ్ వశిష్ఠ్‌, సెయిలర్ రాగేశ్ గోప కుమార్ ఉన్నారు. వీళ్లందరికీ నేవీలో 20 ఏళ్ల సర్వీస్‌ ఉంది. 2019లో కమాండర్ పూర్ణేందు తివారికి ప్రావసి భారతీయ సమ్మాన్ అవార్డు కూడా వచ్చింది. అసలు వీళ్లంతా ఖతార్‌కి ఎందుకు వెళ్లారన్నదే కీలకంగా చెప్పుకోవాల్సిన విషయం. ఖతార్‌లోని ప్రైవేట్ కంపెనీ అయిన Dahra Global Technologiesలో వీళ్లు పని చేశారు. ఈ కంపెనీకి రాయల్ ఒమన్ ఎయిర్ ఫోర్స్ ( Royal Oman Air Force) కి చెందిన రిటైర్డ్ స్వాడ్రన్ లీజర్ ఖమీస్ అల్ అజ్మీ (Khamis al-Ajmi) ఓనర్. గతేడాది ఖమీస్‌ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరవాత వెంటనే విడుదల చేశారు. మిగతా 8 మంది మాత్రం జైల్లోనే ఉండిపోయారు. చాలా సెన్సిటివ్ ప్రాజెక్ట్‌పై వీళ్లంతా పని చేస్తున్నారు. వీళ్లు ఖతార్‌కి వ్యతిరేకంగా పని చేస్తున్నారన్న ఆరోపణలతో అరెస్ట్ అయ్యారు. ఖతార్‌కి చెందిన అత్యంత కీలకమైన సమాచారాన్ని ఇజ్రాయేల్‌కి చేరవేస్తున్నారని ప్రభుత్వం మండి పడింది. గూఢచర్యం ఆరోపణలతో జైలుశిక్ష విధించింది. 


Also Read: Uttarakashi Tunnel Rescue: కార్మికులకు లూడో, ప్లే కార్డ్స్‌ పంపిన అధికారులు - కాసేపు రిలాక్స్ అవ్వాలని సూచన