Uttarakashi Tunnel Rescue Live Updates:
సాయంత్రానికి అందరూ బయటకి..!
ఉత్తరాఖండ్‌లోని సిల్క్‌యారా సొరంగంలో (Silkyara Tunnel) 13వ రోజూ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. నిన్న రాత్రి సమయానికే (నవంబర్ 23) కార్మికులు బయటకు వచ్చేస్తారని భావించినా అది సాధ్యపడలేదు. అర్ధరాత్రి Augur Machine ఉన్నట్టుండి విరిగిపోయింది. ఫలితంగా అప్పటికప్పుడు సహాయక చర్యల్ని ఆపేయాల్సి వచ్చింది. ఇప్పటి వరకూ వర్టికల్ డ్రిల్లింగ్ (Uttarakhand Tunnel Vertical Drilling)చేపట్టిన సిబ్బంది..ఇప్పుడు హారిజాంటల్ డ్రిల్లింగ్‌పై (Uttarakhand Tunnel Rescue Operation) దృష్టి పెట్టింది. ఈ ప్రాసెస్‌లోని సవాళ్లు ఎదురయ్యే అవకాశముందని ఇంటర్నేషనల్ టన్నెలింగ్ ఎక్స్‌పర్ట్ ఆర్నాల్డ్ డిక్స్ (Arnold Dix) వెల్లడించారు. ఇవాళ (నవంబర్ 24) ఎలాగైనా పూర్తి చేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నారు. 41 మంది కార్మికుల కోసం 41 ఆంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచారు. తీవ్రంగా గాయపడిన వాళ్లను వేగంగా హాస్పిటల్‌కి తరలించేందుకు హెలికాప్టర్లనూ ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి 7-9 మీటర్ల మేర డ్రిల్లింగ్ చేయాల్సి ఉంది. అయితే 5 మీటర్ల వరకూ ఎలాంటి అడ్డంకులు లేవని, ఆ తరవాతే ఏమైనా సవాళ్లు ఎదురువుతుండొచ్చని వివరిస్తున్నారు అధికారులు. 5 మీటర్ల వరకూ ఎలాంటి స్టీల్ స్ట్రక్చర్స్ లేకపోవడం వల్ల తొందరగానే డ్రిల్లింగ్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఏదేమైనా సాయంత్రం నాటికి కార్మికులు తప్పకుండా బయటకు వస్తారని ధీమాగా చెబుతున్నారు. అయితే...ఈలోగా కార్మికులు ఒత్తిడికి లోనవకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. రెస్క్యూ ఆపరేషన్ తుది దశకు చేరుకున్న ఈ సమయంలో వాళ్లను మానసికంగా కాస్త రిలాక్స్‌డ్‌గా ఉంచేందుకు Ludo Cardsని అందించారు. కాసేపు కార్డ్ ఆడుకోవాలని కార్మికులకు చెప్పారు. సైకాలజిస్ట్‌ల సూచన మేరకు ఇలా కార్డ్‌లు పంపారు.
"దాదాపు 12 రోజులుగా కార్మికులు లోపలే చిక్కుకున్నారు. వాళ్లు ఎంతో మానసిక ఒత్తిడి లోనవుతారు. ఇప్పుడు వాళ్లు ప్రశాంతంగా ఉండడం చాలా అవసరం. అందుకే లూడో, చెస్‌బోర్డ్, ప్లేయింగ్ కార్డ్స్ పంపుతున్నాం. ఇవి ఆడితే వాళ్లకు కొంతైనా ఒత్తిడి తగ్గుతుంది. ఇప్పటికే ఆపరేషన్ కాస్త ఆలస్యమైంది. ఇంకొంత సమయం పట్టేలా ఉంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం"
-డా. రోహిత్ గోంద్వాల్, సైకియాట్రిస్ట్
Also Read: Delhi Pollution: ఢిల్లీని మళ్లీ కమ్మేసిన కాలుష్యం,దారుణంగా పడిపోయిన గాలి నాణ్యత
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి.*T&C Apply