Delhi Air Pollution Level: 



తగ్గిన ఎయిర్ క్వాలిటీ..


Delhi Pollution News: ఢిల్లీలో వాయు కాలుష్య (Delhi Pollution) తీవ్రత అంతకంతకూ పెరుగుతూనే ఉంది. కాస్త ఊపిరి పీల్చుకునే లోపు మళ్లీ గాలి నాణ్యత దారుణంగా పడిపోతోంది. ప్రస్తుతానికి అక్కడి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (Delhi AQI)"Severe" కేటగిరీలోనే ఉంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) వెల్లడించిన వివరాల ప్రకారం ఆనంద్‌ విహార్‌లో గాలి నాణ్యత 411గా నమోదైంది. అలీపూర్‌లో 432,వజీర్‌పూర్‌లో 443,ఆర్‌కే పురం 422గా నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడం, గాలి వేగమూ తగ్గిపోవడం వల్ల మళ్లీ కాలుష్య స్థాయి పెరిగింది. ఎక్కడ చూసినా పొగమంచే కనిపిస్తోంది.





దాదాపు వారం రోజులుగా "Very Poor" కేటగిరీలో ఉన్న గాలి నాణ్యత ఇప్పుడు "Severe"కి చేరుకుంది. వారం రోజులుగా గాలులు కాస్త వేగంగా వీచాయి. ఫలితంగా కాలుష్య స్థాయి తగ్గింది. ప్రస్తుత పరిస్థితులపై ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ స్పందించారు. కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు కేంద్రం తీసుకొచ్చిన Graded Response Action Plan (GRAP) ఆంక్షల్ని మళ్లీ విధించనున్నట్టు వెల్లడించారు. స్టేజ్-4 ఆంక్షల్ని అమల్లోకి తీసుకొచ్చే యోచనలో ఉన్నట్టు తెలిపారు. గాలి నాణ్యత ఇంకా పడిపోతే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఆంక్షల్లో భాగంగా...ఢిల్లీలోకి భారీ ట్రక్‌లను అనుమతించరు. నిర్మాణ పనులనూ ఎక్కడికక్కడే ఆపేస్తారు. వారం రోజుల క్రితం పరిస్థితులు మెరుగు పడడం వల్ల ఈ ఆంక్షల్ని ఎత్తేశారు. ప్రస్తుతానికి GRAP III ఆంక్షలు అమలవుతున్నాయి. BS III పెట్రోల్‌ వాహనాలతో పాటు BS IV డీజిల్ వాహనాలు ఢిల్లీలోకి రాకుండా బ్యాన్ చేశారు. 






"ఈ కాలుష్యంతో ఊపిరి పీల్చుకోవడమే చాలా కష్టంగా ఉంది. మొన్నటి వరకూ కాస్త ఊరట లభించింది. మళ్లీ ఇప్పుడు ఎయిర్ క్వాలిటీ తగ్గిపోయింది. రెండు మూడు రోజులుగా ఇదే పరిస్థితి ఉంది"


- స్థానికులు