ABP  WhatsApp

Bengal CM Tamil Nadu Visit: స్టాలిన్‌- దీదీ సమావేశం- రాజకీయాలు కాదు అంతకుమించి మాట్లాడారట!

ABP Desam Updated at: 03 Nov 2022 02:54 PM (IST)
Edited By: Murali Krishna

Bengal CM Tamil Nadu Visit: తమిళనాడు పర్యటనలో ఉన్న బంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్‌తో భేటీ అయ్యారు.

(Image Source: PTI)

NEXT PREV

Bengal CM Tamil Nadu Visit: తమిళనాడు సీఎం స్టాలిన్‌తో బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం భేటీ అయ్యారు. స్టాలిన్ నివాసంలో జరిగిన ఈ సమావేశం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపింది. దాదాపు 20 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీపై సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు.



శుభకార్యానికి హాజరయ్యేందుకు తమిళనాడు వచ్చాను. అందులో భాగంగానే నా సోదర సమానుడైన స్టాలిన్‌తో భేటీ అయ్యాను. అయినా ఇద్దరు రాజకీయ నేతలు కలిసినప్పుడు రాజకీయాలే కాదు.. ఇతర విషయాలు కూడా మాట్లాడుకోవచ్చు. మేమైతే రాజకీయాలను మించిన పెద్ద విషయాలే మాట్లాడుకున్నాం.                                                           -        మమతా బెనర్జీ, బంగాల్ సీఎం


ఈ భేటీపై స్టాలిన్‌ కూడా స్పందించారు. మర్యాదపూర్వకంగానే మమత భేటీ అయ్యారని తెలిపారు. తమ మధ్య రాజకీయాల ప్రస్తావన రాలేదని, కోల్‌కతాకు మమత తనను ఆహ్వానించారని స్టాలిన్ చెప్పారు.


ఇప్పుడు ఎక్కడ?


గుజరాత్‌ మోర్బీలో కేబుల్‌ బ్రిడ్జి కూలిపోయిన ఘటనపై బంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనలో 140 మందికిపైగా మృతి చెందారని, ఇందుకు బాధ్యులైన వారిపై ఈడీ, సీబీఐ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని దీదీ ప్రశ్నించారు.



మోర్బీ బ్రిడ్జి కూలిన ఘటనకు కారకులపై ఈడీ, సీబీఐ చర్యలు ఎందుకు చేపట్టలేదు.వాళ్లు కేవలం సామాన్యులపైనే తమ ప్రతాపం చూపిస్తారు. ప్రమాదం జరిగింది ప్రధాని సొంత రాష్ట్రంలో కనుకే నేను ఆయనను విమర్శిస్తున్నాను అనుకోవద్దు. నేను రాజీకీయాల గురించి ఏదీ మాట్లాడబోను. రాజకీయాల కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యం కాబట్టి ఈ ఘటనపై నేను కామెంట్‌ చేయను. ఈ ఘటనపై సుప్రీంకోర్టు పరిధిలో జ్యుడీషియల్‌ కమిటీ వేసి విచారణ జరిపించాలి.                                        "
-        మమతా బెనర్జీ, బంగాల్ సీఎం



9 మంది అరెస్ట్


మోబ్రీ వంతెన కూలిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ ప్రమాదానికి కారణమైన వాళ్లపై పోలీసులు చర్యలు మొదలు పెట్టారు. ఇప్పటికే 9 మందిని అరెస్ట్ చేశారు. సమగ్ర విచారణ కొనసాగుతోంది. మేనేజర్, సూపర్‌వైజర్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. వీరితో పాటు ఈ బ్రిడ్జ్‌కు సంబంధించిన సిబ్బంది అందరినీ విచారిస్తున్నారు. ఇప్పటికే ఓ అధికారి సంచలన విషయం వెల్లడించారు. ఈ వంతెనను మరమ్మతు చేయించాక ఫిట్‌నెస్ సర్టిఫికేట్ రాలేదని చెప్పారు. ప్రస్తుతానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే సీఎం భూపేంద్ర పటేల్ ఘటనా స్థలానికి వచ్చి పరిస్థితులు సమీక్షించారు. ప్రభుత్వం నుంచి అనుమతి పొందకుండానే ఈ వంతెనను ప్రారంభించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ బ్రిడ్జ్ మెయింటేనెన్స్ చూస్తున్న కంపెనీపైనా FIR నమోదు చేశారు పోలీసులు.


Also Read: Gujarat Election 2022 Date: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల- రెండు విడతల్లో పోలింగ్!

Published at: 03 Nov 2022 02:49 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.