Mamata on Akhil Giri Comment:


తీవ్రంగా ఖండిస్తున్నాం: మమతా బెనర్జీ


ఇటీవల తృణమూల్ మంత్రి అఖిల్ గిరి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఆయనపై పలువురు నేతలు ఫిర్యాదు కూడా చేశారు. మమతా బెనర్జీ ఈ వివాదంపై స్పందించి అందరికీ క్షమాపణలు చెప్పాలనీ పట్టుబట్టారు. ఎట్టకేలకు ఈ వివాదంపై స్పందించిన సీఎం మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పారు. "అఖిల్ గిరి చేసిన వ్యాఖ్యలకు నేను క్షమాపణలు చెబుతున్నాను. కచ్చితంగా ఆయనపై కఠిన చర్యలు తీసుకుంటాం. పార్టీతో ఆయన వ్యాఖ్యలకు ఎలాంటి
సంబంధం లేదు" అని వెల్లడించారు. "ఆయన తప్పు చేశారు. మేం కచ్చితంగా ఖండిస్తున్నాం. ఏ మాత్రం ఆ వ్యాఖ్యలను సమర్థించడం లేదు. ఇలాంటి పదాలు వినియోగింటడం ఏ మాత్రం సరికాదు. తప్పకుండా ఖండించాల్సిన విషయమిది" అని తెలిపారు. 










బీజేపీ అటాక్..


రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన తృణమూల్ మంత్రి అఖిల్ గిరిని విమర్శలు చుట్టు ముడుతున్నాయి. ఇప్పటికే బీజేపీ డైరెక్ట్ అటాక్ మొదలు పెట్టింది. తృణమూల్ కాంగ్రెస్ ఆయన వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నా...డ్యామేజ్ అయితే బాగానే జరిగింది. ఆయనపై ఫిర్యాదులూ వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ నేత లాకెట్ ఛటర్జీ ఢిల్లీలో అఖిల్ గిరిపై ఫిర్యాదు చేశారు. మమతా ప్రభుత్వం ఆయనను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. "మమతా బెనర్డీ ఎస్సీ, ఎస్టీలు, గిరిజనుల గురించి  ఎన్నో మాట్లాడుతుంటారు. కానీ...వాళ్లకు గౌరవం ఇవ్వరు. తృణమూల్ కాంగ్రెస్ వైఖరే ఇది. వెంటనే అఖిల్ గిరిని మంత్రి పదవి నుంచి తొలగించాలి" అని అన్నారు. ఈ వివాదంపై మమతా బెనర్జీ తన వివరణ ఇవ్వాలని, ఢిల్లీకి వచ్చి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్‌సీ, ఎస్టీ యాక్ట్ కింద అఖిల్‌ గిరిపై కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు లాకెట్ ఛటర్జీ. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై తృణమూల్ కాంగ్రెస్ మంత్రి అఖిల్ గిరి చేసిన వ్యాఖ్యలను కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా ఖండించారు. మమతా బెనర్జీ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే ఆ మంత్రిని క్యాబినెట్‌ను తొలగించి దేశ ప్రజల ముందు క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యల కారణంగా అంతర్జాతీయంగానూ భారత్‌పై మచ్చ పడుతుందని, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆదివాసులను ఇలా అవమానిస్తూనే ఉంటుందనటానికి ఇదో ఉదాహరణ అని విమర్శించారు. "పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఓ మహిళ. ఆమె క్యాబినెట్‌లోని మంత్రి గిరిజన వర్గానికి చెందిన రాష్ట్రపతిని కించపరిచారు. భారత్‌కు ఉన్న అంతర్జాతీయ గుర్తింపుని ఇలాంటి వ్యాఖ్యలు తుడిచిపెట్టేస్తాయి" అని స్పష్టం చేశారు అర్జున్ ముండా.


Also Read: Gujarat Election 2022: ఒవైసీ ప్రచార సభలో "మోడీ" నినాదాలు, నల్లజెండాలు ప్రదర్శించిన యువకులు