తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు పొడి వాతావరణమే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్‌, కొమరంభీమ్‌, నిర్మల్‌, మంచిర్యాల, కరీంనగర్‌, మెదక్, వికారాబాద్, సంగారెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. రేపటికి నాలుగు జిల్లాల్లోనే ఎల్లో అలెర్ట్‌ జారీ అయింది. అవి ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరం భీమ్. అంటే ఈ ఎల్లో జారీ చేసిసన జిల్లాల్లో కనిష్ణ ఉష్ణోగ్రతలు 11 డిగ్రీల నుంచి 15 డిగ్రీల మధ్య ఉంటుంది. ఈ ప్రాంతాల్లో చలి కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా.  
ఉష్ణోగ్రత వివరాలు చూస్తే... గురువారం గరిష్ణ ఉష్ణోగ్రత 36.6 డిగ్రీలు ఖమ్మంలో నమోదు అయింది. కనిష్ణ ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 11.2 డిగ్రీలుగా నమోదు అయింది. ఇవాళ కనిష్ణ ఉష్ణోగ్రత 34 డిగ్రీల వరకు, కనిష్ణ ఉష్ణోగ్రత 15 డిగ్రీల వరకు నమోదు అయ్యే ఛాన్స్ ఉంది. మిగతా జిల్లాల ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. 

ప్రాంతం పేరు  గరిష్ణ ఉష్ణోగ్రత(డిగ్రీల్లో) కనిష్ణ ఉష్ణోగ్రత(డిగ్రీల్లో)
ఆదిలాబాద్‌ 34.3 11.2 
భద్రాచలం 36.2 19.5 
హకీం పేట్‌ 32.2  19.4
దుండిగల్‌  33.4 17
హన్మకొండ 32  15
హైదరాబాద్‌  34.2  17
ఖమ్మం  36.6  18.6
మహబూబ్‌నగర్‌  36    20.6
మెదక్    34.6    11.8
నల్గొండ    33    15.4
నిజామాబాద్   34.4    16.4
రామగుండం   34.2    14
హయత్ నగర్   33    16.6
పటాన్‌చెరు   34.2    10.8
రాజేంద్రనగర్   33.5    11.5    

ఆంధ్రప్రదేశ్‌ వాతావరణం
ఆంధ్రప్రదేశ్‌లో కూడా మరో నాలుగు రోజల పాటు వాతావరణం పొడిగా ఉంటుంది. ఒకటి రెండు చోట్ల కనిష్ణ ఉష్ణోగ్రతలు సాధారణ ఉష్ణోగ్రత కంటే 2, 3  డిగ్రీలు తక్కువగా నమోదు అయ్యే ఛాన్స్ ఉంది. రాయలసీమలో ఇది రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు ఉంటుంది. 
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి వర్ష సూచన లేదు.