Heat Waves In Andhra Pradesh And Telangana: తెలుగు రాష్ట్రాల్లో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఉదయం 10 గంటలకే ఎండలు(HEAT) భగభగ మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలతోపాటు రాత్రి ఉష్ణోగ్రతలు(Temparature) గణనీయంగా పెరిగిపోయాయి. ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు కొద్దోగొప్ప చల్లగా ఉండే హైదరాబాద్(Hydearabad)లోనూ ఎండలు మండిపోతున్నాయి..
మండుతున్న ఎండలు
మే(May) రాకముందే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. కాలు బయటపెట్టాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం 10 గంటల నుంచే భానుడు భగభగ మండిపోతున్నాడు. పగటి ఉష్ణోగ్రతలతోపాటు(Temapature) రాత్రి కూడా వేడిగాలుల (Heat Waves) ప్రభావం అధికంగా ఉంటోంది. ఏప్రిల్ చివరి నాటికే ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయంటే...మే నెలతోపాటు రోహిణీ (Rohini) కార్తెను తలచుకుంటుంటేనే జనం బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు(Childrens), వృద్ధులు ఎండ, వేడికి తట్టుకోలేకపోతున్నారు. ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh)తో పోల్చితే తెలంగాణ(Telangana)లో ముఖ్యంగా హైదరాబాద్‌లో గతంలో ఎండ తక్కువగా ఉండేది. రోజురోజుకు పెరిగిపోతున్న నగరీకరణకు తోడు, కాంక్రీట్ జంగిల్‌తో చెట్లు మాయమయ్యాయి. దీంతో హైదరాబాద్(Hyderabad)లోనూ ఎండ ఠారెత్తిస్తోంది. నగరం అగ్నిగుండంలా మారిపోయింది. ఆదివారం గరిష్ఠంగా 41.8డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా,...కనిష్ఠ ఉష్ణోగ్రతలు 28.7డిగ్రీలకు చేరాయి.
ఉదయం, సాయంత్రమే పనులు
ఎండలు బాగా పెరిగిపోవడంతో మధ్యాహ్నం బయటకు అడుగు వేయాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. ఏమైనా పనులు ఉంటే ఉదయం 11 గంటల లోపే ముగించుకుని, సాయంత్ర 6 గంటల తర్వాతే బయటకు వస్తున్నారు. దీంతో పగటిఫూట రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. తెలంగాణ వ్యాప్తంగా చూస్తే కరీంనగర్(Karimagar)లో అత్యధికంగా 45.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మండిపోతున్న ఎండలకు హైదరాబాద్ వాతావరణశాఖ చల్లటి కబురు అందించింది. తెలంగాణ వ్యాప్తంగా 14 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవనున్నట్లు తెలిపింది. నిర్మల్, కుమరం భీం, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, సంగారెడ్డి, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో ఆయా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది. అయితే నిన్న జగిత్యాల, ములుగు, నల్గొండతోపాటు కరీంనగర్‌లో రికార్డు స్థాయిలో 45 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
అల్లాడుతున్న ఆంధ్రా
అటు ఏపీ(AP)లో ఎండలు మండిపోతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలకు తోడు...వడగాల్పులు వీస్తుండటంతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. నేడు తీవ్రమైన వడగాల్పులు వీయోచ్చని వాతావరణశాఖ(IMD) హెచ్చరించింది. వివిధ ప్రాంతాల్లో దాదాపు 3 డిగ్రీల అదనపు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. నిన్న అత్యధికంగా నందికొట్కూరు, చాపాడులో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నేడు, రేపు ఉత్తర కోస్తా జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. చిన్నారులు, వృద్ధులు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యాహ్నం బయట తిరగొద్దని వైద్యులు సూచిస్తున్నారు. నీరు ఎక్కువగా తాగాలని, వీలైనంత వరకు నూనె వస్తువుల జోలికి పోకుండా పండ్లు, జ్యూస్ తీసుకోవాలన్నారు. కొబ్బరినీళ్లు, చెరుకు రసం, మజ్జిగ వీలైనంత ఎక్కువ తీసుకోవాలని సూచించారు. వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసిన జిల్లాల్లో పిడుగులుపడే అవకాశం ఉండటంతో పొలాల్లో పనిచేస్తున్నవారు, బయటకు వెళ్లివారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.