Weather Latest News: తెలంగాణ వ్యాప్తంగా మారోసారి వర్షాలు దంచికొట్టబోతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఐదు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షావరణం ఉంటుందని ఐఎండీ పేర్కొంది. వర్షాలు భారీగా కురిసే ప్రాంతాలకు వాతావరణ శాఖ ఎల్లోఅలర్ట్ జారీ చేసింది. 


ఎల్లో అలర్ట్ జారీ అయిన జిల్లాలు:- ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, నిర్మల్‌, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్‌, సంగారెడ్డి, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఇవాళ(సోమవారం) వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. 


ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో మంగళవారం వానలు పడనున్నాయి. 


ఇరవై నాలుగు గంటలుగా జయశంకర్‌ భూపాలపల్లి, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. 
బుధవారం వర్షాలు కురిసే ప్రాంతాలు:- ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భవనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, 


గురువారం వర్షాలు కురిసే ప్రాంతాలు:- ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్. 


శుక్రవారం ఎల్లో అలర్ట్ జారీ అయిన జిల్లాలు:-ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్,  జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెంల, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్‌, వరంగల్, హన్మకొండ, జనగాం, 


శనివారం ఎల్లో అలర్ట్ జారీ అయిన జిల్లాలు:-ఆదిలాబాద్, కొమరం భీం ఆసీఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ 


హైదరాబాద్‌లో వాతావరణం (Telangana)


హైదరాబాద్‌లో కూడా వర్షాలు కురవబోతున్నాయి. ఆదివారం చాలా ప్రాంతాల్లో వర్షాలు కుమ్మేశాయి. సోమవారం కూడా చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఛార్మినార్‌, ఖైరతాబాద్‌, కూకట్‌పల్లి, ఎల్బీనగర్‌, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి జోన్‌లో ఐదు రోజుల పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుంది.  తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఈ ప్రాంతానికి గ్రీన్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌ వాతావరణ శాఖ


ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం(Andhra Pradesh) 


ఆంధ్రప్రదేశ్‌లో అన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్లూరి, కాకినాడ, కోనసీమ, అనకాపల్లి, ఉభయ గోదావరి, కర్నూలు, విజయనగరం, బాపట్ల జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడబోతున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయి. 


ఇవాళ మధ్యాహ్నం వరకూ తీర ప్రాంతంలో అలల వేగం పెరుగుతుందని చెప్పారు. అంతర్వేది నుంచి పెరుమల్లపురం, కృష్ణాతీరంలో నాచుగుంట నుంచి పెద్దగొల్లపాలెం వరకూ అలలు అతివేగంగా వస్తాయని వెల్లడించారు. , నెల్లూరు తీరంలో కోరమాండల్ నుంచి వట్టూరుపాలెం వరకూ పశ్చిమగోదావరి తీర ప్రాంతం అంతటా అలలు అతివేగంతో వస్తాయని పేర్కొన్నారు. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.