Trinayani Serial Today Episode విశాల్ నయని ఒడిలో పడుకొంటాడు. నయని విశాల్‌తో తనకు బాబు పుట్టుంటే ఇలాగే పడుకొనే వాడని అంటుంది.. ఏదో ఒక విధంగా చేయి బాగు చేసే బాధ్యత నాది అని నయని అంటుంది. తన కోసం ఇబ్బంది పడొద్దని విశాల్ అంటాడు. ఉదయం హాసిని, పావనా, దురంధరలు నయని తెరచిన పెట్టె చుట్టూ తిరుగుతూ ఉంటారు. విక్రాంత్ వాళ్లు వచ్చి ఏం చేస్తున్నారని అడుగుతారు.
నయని: సంస్కృతం వచ్చిన గాయత్రీ అమ్మగారు వస్తే తప్ప అందులో ఏముందో చదవలేరు.
తిలోత్తమ: గాయత్రీ అక్కే రావాలా సంస్కృతం వచ్చిన ఎవరైనా చదువుతారు కదా. రప్పింస్తున్నాను.
విశాల్: అమ్మ బయట వాళ్లకి ఈ విషయం గురించి తెలియడం ఎందుకు.
దురంధర: బయట వాళ్లకి తెలిస్తే మునులు కూడా వాటా అడిగే రకం.
తిలోత్తమ: నేను చెప్పిన వ్యక్తి ఈ కాగితాల్లో ఏముందో సరదాగా చదివి వెళ్లిపోతారు. డబ్బులు కూడా ఇచ్చేశా.
గాయత్రీ పాప బయటకు వెళ్తుంది. ఇంతలో తిలోత్తమ చెప్పిన వ్యక్తి వస్తారు. నయని ఆయనతో చదివించడం అవసరమా అంటే తిలోత్తమ విశాల్ చేయి తగ్గాలి కదా అని అంటుంది. ఇక గాయత్రీ పాప బయటకు వెళ్లిందని తెలియగానే విశాల్ తన తల్లి వస్తుందని సంబర పడతాడు. గాయత్రీ పాప పడుకుంటే గాయత్రీ దేవి వస్తుంది. తిలోత్తమ తెచ్చిన పూత అనే వ్యక్తి ఆ పెట్టెను తాకి షాక్‌తో పడిపోతాడు. ఇక విశాల్ నయనికి పెట్టె తెరవమని అంటే నయనికి గాయత్రీ దేవి ఆత్మ కనిపిస్తుంది, అమ్మగారే వస్తున్నారని చెప్తుంది. అందరూ సరదా పడతారు. తిలోత్తమ షాక్‌లో తెగ కంగారు పడుతుంది. గాయత్రీ దేవిని చూస్తుంది.
గాయత్రీదేవి: నయని నేను అనుకున్న ప్రకారం పెట్టె తెరవడానికి సమయం వచ్చింది విధి విధాను సారమే విశాల్‌కి తేలు కుట్టింది.
నయని: బాబు గారు కలిసి మాతో ఉంటున్నారు కానీ నొప్పిని ఆయన ఎంత అనుభవిస్తున్నారో నాకు తెలుస్తుంది అమ్మగారు.
తిలోత్తమ పూత అనే వ్యక్తికి తొందరగా చదవమని అంటుంది. గాయత్రీదేవి పెట్టె తెరుస్తుంది. ఇక గాయత్రీదేవి తిలోత్తమతో నువ్వు తెచ్చిన వ్యక్తికి త్వరగా చదవమని చెప్పు అని అంటుంది. తిలోత్తమ చెప్తే ఆ వ్యక్తి చదవడానికి వెళ్తాడు. శనివారం ఆంజనేయ స్వామికి వరమాల సమర్పిస్తే మీకు పట్టిన గ్రహా పీడ పోతుందని అందులో ఉందని చెప్తాడు. అందరూ షాక్ అవుతారు. ఆదివారం దీపారాధన చేయాలని అతను అంటే గాయత్రీదేవి పెట్టెతో అతనికి ఒక్కటిస్తుంది. దాంతో ఆయన అటు ఇటు తిరుగుతాడు. ఆయనకు సంస్కృతం రాదని అందుకే గాయత్రీదేవి కొట్టిందని అందరూ అంటారు. దాంతో తిలోత్తమతో పాటు అందరూ ఆయన్ను చితక్కొడతారు. చివరకు ఆయన తనకు సంస్కృతం రాదని ఒప్పుకొని పారిపోతాడు. ఇక నయని, తిలోత్తమ గాయత్రీదేవి ఆత్మ కోసం వెతుకుతారు. గాయత్రీ పాప నిద్ర లేస్తుంది పూతని చూసి నవ్వుతుంది. డబ్బులు వేస్ట్ అయ్యాయని తిలోత్తమ, వల్లభలు ఫీలవుతారు. నయని, హాసినిలు అక్కడికి వచ్చి సెటైర్లు వేస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: పాపను పాముల పడగపై పెట్టగానే ఏం జరుగుతుంది..? పెట్టె గురించి గురువుగారు చెప్పిన రహస్యం ఏంటి..?