Amrutha Pranay will go BB House: బిగ్‌బాస్ దేశ వ్యాప్తంగా ప్రజాదరణ పొందిన రియాల్టీ షో. బాలీవుడ్‌లో మొదలైన ఈ షోను... ఇప్పుడు అన్ని భాషల్లో నిర్వహిస్తున్నారు. హిందీలో బిగ్‌బాస్-18 మొదలుకాబోతుంటే... తెలుగులో బిగ్‌బాస్-8 వారంలో రోజుల్లో స్టార్ కాబోతుంది. ఈ షోకు కూడా హీరో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. వినోదం తీసుకొచ్చేందుకు మేము రెడీ.. అంతులేని వినోదాన్ని ఆనందించేందుకు మీరు రెడీనా..! అంటూ కొత్త లోగోను కూడా షేర్ చేశారు నాగార్జున. దీంతో... తెలుగు బిగ్‌బాస్-8లోని ఎవరెవరు వెళ్లబోతున్నారు.. అన్న దానిపై ఆసక్తి నెలకొంది. చాలా మంది పేర్లు వినిపిస్తున్నప్పటికీ అమృతా ప్రణయ్.. ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న వార్త... మరింత ఆసక్తి పెంచుతోంది. మరి... అమృతా ప్రణయ్ (Amrutha Pranay).. బిగ్‌బాగ్-8 హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా..?
బిగ్‌బాస్-8లోకి అమృతా ప్రణయ్..?
బిగ్‌బాస్-8 షోకి అమృతా ప్రణయ్ వెళ్లబోతున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆమె కూడా స్పందించారు. తాను బిగ్‌బాస్‌లోకి వెళ్లడం లేదని.. నిర్వాహకుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఆఫర్ రాలేదని అంటోంది. అయితే.. తాను బిగ్‌బాస్‌లోకి వెళ్తున్నట్టు ప్రచారం జరగుతుండటంతో...అందరూ ఇదే ప్రశ్న అడుగుతున్నారని తెలిపింది. అమ్మ కూడా అడిగిందని.. బంధువులు కూడా ఇదే అడుగుతున్నారని చెప్పుకొచ్చింది. బిగ్‌బాస్‌లోకి వెళ్లేటట్టు ఉంటే.. ముందే చెప్తే.. అన్నింటికి సిద్ధపడి ఉంటామని.. తన తల్లి, బంధువులు అంటున్నారని తెలిపింది.
అమృతా ప్రయణ్ గురించి కొన్ని వివరాలు...
అమృత మిర్యాలగూడకు చెందిన అమ్మాయి. ఆమె తండ్రి మారుతీరావు వ్యాపారవేత్త. పెద్దలను ఎదిరించి.. ప్రయణ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది అమృత. అయితే... 2018 సెప్టెంబర్ 14న.. ప్రణయ్ హత్య సంచలనంగా మారింది. అమృత తండ్రి మారుతీరావు సుపారీ ఇచ్చి.. ప్రణయ్‌ను హత్య చేయించాడు. భర్తను చంపేసిన సమయంలో అమృత గర్భవతి. భర్త హత్యను తట్టుకోలేక... తండ్రి మారుతీరావుపై కేసు పెట్టింది. కేసు విచారణలో ఉండగానే మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం కుమారుడు నిహాన్‌ను చూసుకుంటూ కాలం గడుపుతోంది అమృత. యూట్యూబ్‌లో వీడియోలు చేస్తోంది. కొంత కాలంగా.ఈ వీడియోలు చేయకపోవడం వల్ల ఆమె బిగ్‌బాస్ హౌజ్‌కి వెళ్తుందన్న ప్రచారం మొదలైంది. దీనికి కూడా అమృత క్లారిటీ ఇచ్చింది. కొన్ని వ్యక్తిగత కారణాల వల్లే వీడియోలు చేయడం లేదని చెప్పింది.