కేరళ, తమిళనాడు తీరానికి ఆనుకొని ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది నాలుగైదు రోజుల పాటు వాతావరణం వర్షావరణంలా ఉంటుదని పేర్కొంది. ఇప్పటికే కోస్తా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. అండమాన్, నికోబార్, కర్నాటక కోస్తా, దక్షిణ ప్రాంతాల్లో, కోస్తాంధ్రా, రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. నాలుగు ఐదు రోజులు కూడా అదే వాతావరణం అక్కడ కనిపించనుంది.
అల్పపీడన ద్రోణి తమిళనాడు సమీపంలో కేరళ తీరానికి ఆనుకొని కొనసాగుతోంది. మరొక తుఫాను ప్రసరణ తక్కువ ట్రోపోస్పిరిక్ స్థాయిల్లో ఉత్తర & ఆనుకొని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం మీద ఉంది. ఈ రెండి ప్రభావంతో అండమాన్ & నికోబార్ దీవుల్లో అక్కడక్కడా తేలికపాటి/మితమైన వర్షపాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ కేరళ, కర్నాటక, తమిళనాడు కోస్తా ప్రాంతాల్లో వచ్చే 4-5 రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి/మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
వివిధ ప్రాంతాల్లో వర్షపాతం ఇలా- నర్సీపట్నంలో నాలుగు సెంటీమీటర్లు, భీమునిపట్నంలో మూడు సెంటీమీటర్లు, విశాఖపట్నంలో మూడు సెంటీమీటర్ల వర్షం కురిసింది.
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో భారీ మార్పులు లేకపోయినా ఉష్ణోగ్రతలు మాత్రం పడిపోనున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీల మధ్య పడిపోనున్నాయి. మధ్యభారత్‌తోపాటు ఉత్తరాదిలో ఇది 8 నుంచి 10 డిగ్రీల మేర ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. చలి తీవ్రత మాత్రం పెరిగే ఛాన్స్ ఉంది. రాజస్థాన్ ప్రాంతం నుంచి వీచే గాలులు కారణంగా మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల జనాలు ఇబ్బంది పడొచ్చు.
వివిధ చోట్ల చలి ఇలా..
తెలంగాణలోని వివిధ చోట్ల నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు విడుదల చేశారు. రాష్ట్రంలో ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్‌లో 12.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత, మెదక్‌లో 15 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లుగా అధికారులు వెల్లడించారు. సాధారణంగా 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటే పసుపు రంగు అలర్ట్ చేస్తారు. అందులో భాగంగా ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో పసుపు రంగు అలర్ట్ చేశారు. నిజామాబాద్‌లో 19.3, రామగుండం 16.8, హన్మకొండ 18.5, భద్రాచలం 23.5, ఖమ్మం 23.6, నల్గొండ 18.4, మహబూబ్ నగర్ 22.7, హైదరాబాద్ 18.6 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.