ఆతిథ్య దేశం ఖతార్ ఫిఫా ప్రపంచకప్ నుంచి ఎలిమినేట్ అయ్యే ప్రమాదంలో పడింది. శుక్రవారం సెనెగల్ చేతిలో ఖతార్ 3-1తో పరాజయం పాలైంది. మొదటి సగంలో బౌలే డియా, రెండో సంగం ప్రారంభంలో ఫమారా డిడియో టైమ్‌లో గోల్స్ చేసి సెనెగల్‌కు 2-0 ఆధిక్యాన్ని అందించాడు.
సబ్‌స్టిట్యూట్ ఆటగాడు మహ్మద్ ముంటారి 78వ నిమిషంలో గోల్ కొట్టడంతో ఖతార్ గేమ్‌లోకి తిరిగొచ్చింది. కానీ సెనెగల్ ప్రత్యామ్నాయం బాంబా డియెంగ్ ఆరు నిమిషాల తర్వాత స్కోర్ చేసి 3-1తో తిరుగులేని ఆధిక్యంలోకి తీసుకొచ్చాడు. దీంతో నెదర్లాండ్స్ చేతిలో 2-0తో ఓడిపోయిన సెనెగల్ తిరిగి ట్రోఫీ రేసులోకి వచ్చింది.
నెదర్లాండ్స్‌పై ఈక్వెడార్ విజయం సాధించకపోతే రెండు మ్యాచ్‌లతోనే టోర్నమెంట్ నుంచి వైదొలిగిన వరల్డ్ కప్ హోస్ట్‌లుగా చెత్త రికార్డును ఖతార్ సొంతం చేసుకుంటుంది. ఈక్వెడార్ చేతిలో 0-2 తేడాతో ఓటమి పాలైన ఖతార్ ఇప్పుడు టోర్నీ నుంచి వెనుదిరిగే ప్రమాదంలో పడింది. ఆసియా ఛాంపియన్లు తమ గోల్ కీపర్ సాద్ అల్ షీబ్‌ను పక్కన పెట్టారు. ఓపెనింగ్ మ్యాచ్‌లో అతని చెత్త ప్రదర్శనే దీనికి కారణం.
అతని స్థానంలో వచ్చిన మెషాల్ బర్షమ్ ప్రారంభ దశలో పెద్దగా ఆత్మవిశ్వాసాన్ని కనపరచలేదు. దీంతో ప్రారంభంలోనే గోల్ చేసింది. అప్పటికి సెనెగల్‌కు స్కోర్ చేసే అవకాశాలను ఇస్మాయిలా సర్, నంపాలిస్ మెండీ కోల్పోయారు. మొదటి అర్ధభాగం గడిచేకొద్దీ ఇద్రిస్సా గనా గుయె, యూసౌఫ్ సబాలీలు ఎక్కువ సమయం వృధా చేశారు.