Weather Latest News: కొన్ని రోజుల నుంచి ఉక్కతో అల్లాడిపోయిన తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ ఊరట ఇచ్చే వార్త చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడే అల్ప పీడన ప్రభావంతో కొన్ని రోజుల పాటు జోరు వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తోంది.
నైరుతి బంగాళాఖాతంలో సముద్రమట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింతగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని కారణంగానే వాతావరణం చల్లబడుతుందని అన్నారు. ఈ ఆవర్తనం వాయవ్యదిశగా కదిలుతోంది. ఇది మరో రెండు రోజుల్లో మరింతగా బలపడి అల్పపీడనంగా మారుతుంది. దీని కారణంగానే తెలుగు రాష్ట్రాల్లో వర్షాల పడనున్నాయి.
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది.
నైరుతి ఉపసంహరణ- ఈశాన్యం రాక
మరో వైపు దేశంలో నైరుతు రుతపవాల నిష్క్రమణకు సమయం ఆసన్నమైందని తెలిపింది వాతావరణ శాఖ. అదే టైంలో ఈశాన్య రుతుపవనాల వచ్చేందుకు కూడా వాతావరణం అనుకూలంగా ఉందని అంటున్నారు. వీటన్నింటి కారణంగానే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని అన్నారు.
ఆగస్టు చివరి వారంలో వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో దంచి కొట్టాయి. వాగులు వంకలు విపరీతంగా పొంగాయి. దీని కారణంగానే ఖమ్మం, విజయవాడ నీట మునిగింది. ఆ రెండు ప్రాంతాల్లో మునుపెన్నడూ చూడని వరదలు ముంచెత్తాయి. అక్కడ పరిస్థితిలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఈ టైంలో మరోసారి వర్షాలు అంటేనే భయపడిపోతున్నారు.
అంతా విధ్వంసం సృష్టించిన వానలు కొన్ని రోజులుగా విరామం ప్రకటించాయి. ఈ విరామంలో వాతావరణం మాత్రం వేసవిని తలపించింది. ఉక్కపోతతో తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు అల్లాడిపోయారు. ఈ టైంలో మళ్లీ ఇప్పుడు వర్షాలు కురుస్తాయన్న వార్త ఆనందాన్ని ఇస్తోంది.
తెలంగాణలోని వివిధ జిల్లాలకు ఎల్లో అలర్‌ట జారీ చేశారు. అక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఆ జాబితాలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా, వికారాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కొత్తగూడెం, జగిత్యాల, కరీంనగర్, నిర్మల్, ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, మెదక్, జిల్లాలు ఉన్నాయి. ఇక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖాధికారులు పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో వాతావరణం పొడిగా ఉంటుందని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు అధికారులు.
బంగాళాఖాత్లో ఏర్పడిన ఆవర్తం బలపడుతున్నందున అది తుపానుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ప్రమాదం ఆంధ్రప్రదేశ్‌కు ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం... బంగాళాఖాతం పరిసరాల్లో ఈనెల 24న అల్పపీడనం ఏర్పడుతుందని అది తుపానుగా మారుతుంది. ఈ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయి. ఉత్తరాంధ్ర జిల్లా, గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలపై తీవ్ర ప్రభావం ఉంటుంది. అక్కడే భారీ వర్షాలు కురుస్తాయి.
Also Read: పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు రేట్లు ఇవి