ఏనుగులు కోపం వస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. తాజాగా ఒక ఏనుగు.. గ్రామస్థులను తరిమిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.


ఇదీ జరిగింది


సాధారణంగా అటవీ ప్రాంతాలకు సమీపంలోని గ్రామాల్లో అప్పుడప్పుడు అడవి జంతువులు ప్రవేశిస్తుంటాయి. పులులు, చిరుతలు వంటి క్రూర జంతువులు వచ్చినప్పుడు గ్రామస్థులు.. అటవీ అధికారులకు సమాచారం ఇస్తారు. అయితే ఏనుగులు వంటి వచ్చినప్పుడు తమ పంటలు కాపాడుకునేందుకు వాటిని తరిమేందుకు ప్రయత్నిస్తారు. 


అసోం గోల్పారా జిల్లాలో తాజాగా అలాంటి ఘటనే జరిగింది. ఆహారం కోసం వెతుక్కుంటూ 40 ఏనుగులతో కూడిన ఓ మంద అక్కడికి చేరింది. వరి పొలాలను ధ్వంసం చేసింది. దీంతో స్థానికులు వాటిని వెనక్కి తరుముతున్నారు. కానీ ఓ ఏనుగు తనను తరుముకుంటూ వస్తున్న జనాలకు ఎదురుతిరిగింది. ఒక్కసారిగా వెనక్కి మళ్లి వారి వెంటపడింది. కొంత దూరం వెంబడిస్తూ వచ్చి ఏనుగు వెనక్కి తిరగగానే.. జనం మళ్లీ దాని వెంటపడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






Also Read: UP Man Dies: డ్యాన్స్ వేస్తుండగా హార్ట్ ఎటాక్! వైరల్ వీడియో