PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లో రెండో రోజు పర్యటించారు. శుక్రవారం తన పర్యటనలో భాగంగా అహ్మదాబాద్‌ నుంచి గాంధీనగర్ వెళ్తుండగా ఒక అంబులెన్స్‌ (PM Modi's Convoy Gives Way to Ambulance)కు మార్గం ఇచ్చేందుకు ప్రధాని తన కాన్వాయ్‌ను నిలిపి వేయాలని ఆదేశించారు. ఇందుకు సంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 





'మోదీ శకంలో వీఐపీ కల్చర్‌కు తావులేదు' అంటూ ఈ వీడియోను ఓ భాజపా నేత ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అహ్మదాబాద్‌లోని దూరదర్శన్ కేంద్రం సమీపంలో మధ్యాహ్నం జరిగిన బహిరంగ సభను ముగించుకుని గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌కు మోదీ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.


వందే భారత్ ఎక్స్‌ప్రెస్


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. మహారాష్ట్ర, గుజరాత్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను శుక్రవారం ప్రారంభించారు. వందే భారత్ రైలులో నరేంద్ర మోదీ ప్రయాణించారు. ముంబయి-గాంధీనగర్ రూట్‌లో వందే భారత్ రైలు సేవల్ని అందించనుంది. 




మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారతీయ రైల్వే వందే భారత్ రైళ్లను నడుపుతోంది. ఇప్పటికే రెండు వందే భారత్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. న్యూ దిల్లీ-వారణాసి, న్యూ దిల్లీ-మాతా వైష్ణో దేవి కాట్రా రూట్‌లో వందే భారత్ ట్రైన్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు ముంబయి-గాంధీనగర్ రూట్‌లో వందే భారత్ రైలు అందుబాటులోకి వచ్చింది


ముంబయి-గాంధీనగర్ రూట్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆదివారాలు తప్ప వారంలో ఆరు రోజులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. రైలు నెంబర్ 20901 ముంబయి సెంట్రల్‌లో ఉదయం 6.10 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 12.30 గంటలకు గాంధీనగర్ చేరుకుంటుంది. రైలు నెంబర్ 20902 గాంధీనగర్‌లో మధ్యాహ్నం 2.05 గంటలకు బయల్దేరి రాత్రి 8.35 గంటలకు ముంబయి చేరుకుంటుంది.



Also Read: Kerala Dog Attack: పిల్లి కరిచిందని ఆసుపత్రికి వెళ్లిన యువతిపై కుక్క దాడి!


Also Read: Kanpur News: హాస్టల్‌లో అమ్మాయిల న్యూడ్ వీడియోలు రికార్డ్ చేసిన స్వీపర్!