Vande Bharat Trains :  వందేభారత్ రైలు రికార్డు క్రియేట్ చేసింది. ట్ర‌య‌ల్ ర‌న్‌లో ఆ రైలు గంట‌కు 180 కిలోమీట‌ర్ల వేగంతో దూసుకువెళ్లింది. శుక్ర‌వారం టెస్ట్ ర‌న్ నిర్వ‌హించారు. ఈ విష‌యాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్ త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు. కోటా-నాగ్డా సెక్ష‌న్ మ‌ద్య రైలు వేగాన్ని ప‌రీక్షించారు. టెస్ట్ ర‌న్ నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో రైలులో వాషింగ్‌, క్లీనింగ్‌తో పాటు అన్ని ప‌రిక‌రాల ప‌నితీరును ప‌రిశీలించిన‌ట్లు సోషల్ మీడియాలో తెలిపారు. 



ఆ రూట్‌లో  వందే భారత్ ఎక్స్  ప్రెస్ దూసుకెళ్తున్న వీడియోలను కొంత మంది ప్రజలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 





కోటా-నాగ్డా రూట్లో రైలు స్పీడ్ లెవ‌ల్స్‌ను టెస్ట్ చేశారు.  16 కోచ్‌ల‌తో వందేభార‌త్ రైలును ప‌రీక్షించారు. కోటా డివిజ‌న్‌లో వివిధ ద‌శ‌ల్లో ట్ర‌య‌ల్స్ చేప‌ట్టారు. కోటా నుంచి ఘాట్ కా బ‌రానా మ‌ధ్య మొద‌టి ద‌శ ట్ర‌య‌ల్‌, ఘాట్ కా బ‌రానా నుంచి కోటా మ‌ధ్య రెండో ద‌శ ట్ర‌య‌ల్‌, కుర్లాసీ నుంచి రామ్‌గంజ్ మ‌ధ్య మూడ‌వ ద‌శ ట్ర‌య‌ల్‌, నాలుగ‌వ‌-అయిద‌వ ద‌శ ట్ర‌య‌ల్ కూడా ఈ స్టేష‌న్ల మ‌ద్య డౌన్‌లైన్‌లో చేప‌ట్టారు.





వందేభార‌త్ రైలును పూర్తిగా ఇండియాలోనే త‌యారీ చేస్తున్నారు. దీన్ని సెమీ హై స్పీడ్ ట్రైన్‌గా పిలుస్తున్నారు. వందేభార‌త్‌కు ప్ర‌త్యేక ఇంజిన్ ఉండ‌దు.  . ఇందులో ఆటోమేటిక్ డోర్లు, ఏసీ చైర్ కార్ వంటివి ఉంటాయి. తక్కువ విద్యుత్తును వినియోగించుకునేలా వీటిని అభివృద్ధి చేస్తున్నారు. ఈ రైళ్ళను స్టీల్‌తో కాకుండా తక్కువ బరువు ఉండే అల్యూమినియంతో రూపొందిస్తున్నారు.





వందే భారత్ ట్రైల్ రన్స్ సక్సెస్ అవుతూండటంతో..  త్వరలో వాటిని దేశవ్యాప్తంగా ప్రవేశపెడుతారు. అవి ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించనున్నాయి. దేశంలో 400 కొత్తతర వందే భారత్‌ రైళ్ళను ప్రవేశపెట్టనున్నట్లు గత కేంద్ర బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ కూడా ప్రకటించారు. ఇందులో భాగంగా తయారైన రైళ్ళకు ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు.