Visakha Crime News: విశాఖపట్నం జిల్లా సింహాచలం రైల్వే స్టేషన్ వద్ద ఇద్దరు యువకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. తీవ్ర కోపోద్రిక్తుడైన ఓ వ్యక్తి.. మరో వ్యక్తి తల పగులగొట్టడంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. అయితే ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. 


జిల్లాలోని సింహాచలం రైల్వే స్టేషన్ వద్ద గత కొన్నేళ్లుగా ఓ యాచకుడు అక్కడే భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగించేవాడు. రోజంతా బిక్షటన చేసుకుంటూ రాత్రి కాగానే... ఒక షాపు వద్దకు వచ్చి బయటే నిద్రించేవాడు. అయితే ఆ స్థలంలోకి మరో యాచకుడు వచ్చి పడుకున్నాడు. రోజూలాగే వచ్చిన యాచకుడు చూసి.. ఇది నేను పడుకునే స్థలమని.. రోజంతా నేను ఇక్కడే పడుకున్నానని చెప్పాడు. తను పడుకునే స్థలం నుంచి వెళ్లిపోమని చెప్పగా.. అతను అందుకు ఒప్పుకోలేడు. దీంతో వీరిద్దరి మధ్య గొడవ ప్రారంభం అయింది. ఒకరినొకరు తిట్టుకోవడం నుంచి కొట్టుకోవడం వరకు చేరింది. ఈ క్రమంలోనే ఓ యాచకుడు మరో యాచకుడి తనను పగులగొట్టాడు. ఈ క్రమంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు గోపాలపట్నం సీఐ సతీష్ తెలిపారు. 


స్థలం అమ్మలేదని భార్యనే చంపేశాడు..!


గుంటూరు జిల్లా తెనాలిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తెనాలి గాంధీ నగర్ గంటా వారి వీధిలో భార్యను కిరాతకంగా హత్య చేశాడు భర్త.   కాకర్ల స్వాతి, కోటేశ్వరరావులకు 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. భార్య పేరు మీద ఉన్న స్థలాన్ని అమ్మి తన అప్పులు తీర్చాలని కొద్దీ రోజులుగా ఆమెను వేధిస్తున్నాడు భర్త కోటేశ్వరరావు. ఈ విషయంపై తరచూ గొడవపడేవాడు. స్వాతి స్థానికంగా బ్యూటీ పార్లర్ నడుపుతోంది. గురువారం బ్యూటీ పార్లర్ షాప్ లో స్వాతి ఉండగా కోటేశ్వరరావు కత్తితో దాడి చేశాడు. మెడపై బలంగా నరకడంతో స్వాతి అక్కడికక్కడే కుప్పకూలింది.  అనంతరం ఆమె మృతదేహానికి రెండు దండలు వేసి నివాళి అర్పించాడు. తర్వాత తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు కోటేశ్వరరావు. ఘటనా స్థలిని పరిశీలించిన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే హత్యకు ఫ్లాన్ చేసిన కోటేశ్వరరావు వస్తూ రెండు పూల దండలు తీసుకువచ్చి చంపిన తరువాత స్వాతి మృతదేహంపై వేశాడు.  







అసలేం జరిగింది? 






కాకర్ల కోటేశ్వరరావు, స్వాతిలకు 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. స్వాతి తెనాలిలో బ్యూటీపార్లర్ నిర్వహిస్తుంది. కోటేశ్వరరావు అప్పులు చేయడం మొదలపెట్టాడు. పెళ్లి సమయంలో భార్య పుట్టింటి నుంచి సంక్రమించిన స్థలాన్ని అమ్మి తన అప్పులు తీర్చాలని స్వాతిపై ఒత్తిడి తెచ్చాడు. నెలరోజులు క్రితం స్వాతికి, కోటేశ్వరరావుకు మధ్య గొడవ జరిగింది. దీంతో స్వాతి పుట్టింటికి వెళ్లింది. తిరిగి కొన్ని రోజుల తర్వాత అత్తింటికి తిరిగి వచ్చింది. మంగళవారం రాత్రి ఇరువురి మధ్య గొడవ జరిగింది. స్వాతిపై కోటేశ్వరరావు దాడి చేశాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. బ్యూటీ పార్లర్ ​లో స్వాతి ఒంటరిగా ఉందని తెలుసుకుని కత్తితో దాడికి పాల్పడ్డాడు. పథకం ప్రకారమే భార్యపై కత్తితో దాడి చేసి మెడ మీద వేటువేశాడు. ఆమె మరణించిందని నిర్ధారించుకుని స్థానిక  పోలీస్ స్టేషన్ లో ​లో లొంగిపోయాడు కోటేశ్వరరావు.