Gaza Fire Accident: పాలస్తీనా గాజాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది చిన్నారులు సహా 21 మంది సజీవ దహనమయ్యారు. ఇంట్లో ఇంధనం నిల్వ చేయడంతో ప్రమాద తీవ్రత పెరిగినట్లు తెలుస్తోంది.
ఇదీ జరిగింది
గాజా స్ట్రిప్‌లోని ఓ ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 21 మంది సజీవ దహనమయ్యారు. వీరిలో తొమ్మిది మంది చిన్నారులు ఉన్నారు. గాజాలో అత్యధిక జనాభా కలిగిన జబాలియా శరణార్థుల క్యాంపు ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అక్కడి నాలుగంతస్తుల ఇంట్లో మంటలు చెలరేగాయి.
మొదట చివరి అంతస్తులో మంటలు అంటుకున్నాయని, క్రమంగా అవి భవనం మొత్తానికి వ్యాప్తి చెందాయని అధికారులు వెల్లడించారు.
ఈ అగ్నిప్రమాదాన్ని జాతీయ విషాదంగా పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ ప్రకటించారు. గాజాలోని ఎనిమిది శరణార్థుల క్యాంపుల్లో జబాలియా ఒక్కటి. ఇక్కడ 20 లక్షల 30 వేల మంది నివాసముంటున్నారు.
Also Read: PM Modi: 'వెయిట్ చేయొద్దు, వెంబడించండి'- ఉగ్రవాదులకు మోదీ మాస్ వార్నింగ్