Jai Shri Ram Flag:


స్కై డైవింగ్..


అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం మరి కొద్ది రోజుల్లోనే జరగనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అంతా సిద్ధం చేస్తున్నాయి. భారత్‌లోనే కాకుండా విదేశాల్లోని ఇండియన్స్ కూడా అయోధ్య ఉత్సవంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కి చెందిన 22 ఏళ్ల అనామిక శర్మ రాముడిపై ఉన్న భక్తిని చాటుకుంది. దాదాపు 13 వేల అడుగుల ఎత్తులో ఆకాశంలో "jai shree Ram" జెండాని ప్రదర్శించింది. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో స్కైడైవింగ్‌ చేస్తూ ఇలా జెండాని ప్రదర్శించింది. జెండా ఎగరేసే ముందు అలా గాల్లో డ్యాన్స్ కూడా చేసింది. తన మతాన్ని ఉన్నత స్థాయిలో ఉంచాలన్న ఉద్దేశంతోనే ఇలా స్కై డైవింగ్ చేసినట్టు చెబుతోంది అనామిక. 


"నా మతం అంటే నాకెంతో గౌరవం. దాన్ని మరింత ఉన్నత స్థానంలో నిలబెట్టాలనుకున్నాను. అందుకే స్కైడైవింగ్ చేసి ఇలా నా గౌరవాన్ని చాటుకున్నాను"


- అనామిక శర్మ






22న ఉత్సవం..


ఈ నెల 22న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా బాల రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దగ్గరుండి మరీ అన్ని ఏర్పాట్లు చేయిస్తున్నారు. భిన్న రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానం అందింది. కాంగ్రెస్ సహా మరి కొన్ని పార్టీల్లోని కీలక నేతలకూ ఆహ్వానం పంపింది ప్రభుత్వం. ఆ రోజు భక్తులందరూ రావడానికి అవకాశం ఉండదని అందుకే రాముడిపై భక్తి చాటుకునేందుకు ఇంట్లోనే Shri Ram Jyoti వెలిగించాలని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. ఈ ఉత్సవం పూర్తయ్యాక అందరూ వచ్చి అయోధ్య రాముడిని దర్శించుకోవాలని సూచించారు. 


ఇన్విటేషన్‌ల విషయంలో కాస్త రాజకీయ రగడ కొనసాగుతోంది. కొంతమంది కీలక నేతలు తమకు ఆహ్వానం అందలేదని అసహనంతో ఉన్నారు. UBT శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే ఇప్పటికే ఈ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు ఇన్విటేషన్ పంపలేదని చెప్పారు. ఈ వివాదంపైనే  Shri Ram Janmabhoomi Temple ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ స్పందించారు. కేవలం రాముడి భక్తులకు మాత్రమే ఇన్విటేషన్‌లు పంపామని తేల్చి చెప్పారు. రాముడి పేరు చెప్పుకుని బీజేపీ రాజకీయాలు చేస్తుందన్న విమర్శల్నీ కొట్టిపారేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడికి వెళ్లినా ఆయనను గౌరవిస్తున్నారని అన్నారు. అంతకు ముందు ఉద్ధవ్ థాక్రే బీజేపీపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాముడి పేరుతో రాజకీయాలు చేయడం సరికాదని మండి పడ్డారు. మందిర ఉత్సవాన్ని కేవలం ఓ పార్టీకే పరిమితం చేయడమేంటని ప్రశ్నించారు.


Also Read: రాముడు మాంసాహారి, అడవిలో జంతువులను వేటాడి తినే వాడు - NCP నేత వివాదాస్పద వ్యాఖ్యలు