Bhopal viral video: పెళ్లిలో భోజనం చేశాడని MBA విద్యార్థితో గిన్నెలు కడిగించారు!

ABP Desam   |  Murali Krishna   |  02 Dec 2022 10:57 AM (IST)

Bhopal viral video: ఆహ్వానం లేకుండా పెళ్లికి వచ్చి ఉచితంగా భోజనం చేశాడని ఓ విద్యార్థితో అంట్లు తోమిచ్చారు.

(Image Source: Twitter)

Bhopal viral video: పెళ్లిలో పాత్రలు కడగమని ఓ వ్యక్తిని బలవంతం చేసిన వీడియో వైరల్‌గా మారింది. మధ్యప్రదేశ్‌లోని ఓ వివాహ కార్యక్రమంలో ఈ వీడియో రికార్డ్ చేశారు. ఎంబీఏ విద్యార్థి అయిన వ్యక్తి వివాహ వేడుకలో అన్నం తిన్నాడని వారు ఈ పని చేశారు.

ఇదీ జరిగింది

జబల్‌పుర్ నగరానికి చెందిన ఓ విద్యార్థి భోపాల్‌లో ఎంబీఏ చదువుతున్నాడు. ఆ విద్యార్థి పిలవని పెళ్లి విందుకు వచ్చి ఉచితంగా భోజనం చేశాడు. ఇది చూసి పట్టుకున్న పెళ్లి వారు ఇందుకు శిక్షగా అతనితో బలవంతంగా గిన్నెలు కడిగించారు.

పిలవని పెళ్లి విందులో ఉచితంగా భోజనం చేస్తే శిక్ష ఏంటో తెలుసా? ఇప్పుడు మీ ఇంట్లో మాదిరిగానే పాత్రలు కూడా సరిగ్గా కడుగు. నువ్వు ఎంబీఏ చదువుతున్నావు, నీ తల్లిదండ్రులు డబ్బు పంపడం లేదా? నువ్వు జబల్‌పుర్‌కు చెడ్డ పేరు తీసుకువస్తున్నావు.                                                                  -    పెళ్లి వారు

వైరల్ 

ఇలా ఆ విద్యార్థితో గిన్నెలు కడిగించి ఓ వ్యక్తి వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ప్లేట్లు కడిగిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? అని ఆ వ్యక్తి ఎంబీఏ విద్యార్థిని అడిగాడు. "ఉచితంగా ఆహారం తిన్నాను. ఏదో ఒకటి చేయాలి" అని ఆ విద్యార్థి చెప్పుకొచ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లి విందులో విద్యార్థులు తినడం సర్వసాధారణమని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానించారు. విద్యార్థితో గిన్నెలు కడిగించి అవమానపర్చడం చాలా తప్పు అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

Also Read: GetOutRavi hashtag: ట్రెండింగ్‌లో GetOutRavi హ్యాష్ ట్యాగ్- తమిళనాడు గవర్నర్ ఏం చేశారు?

Published at: 02 Dec 2022 10:55 AM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.