Stocks to watch today, 02 December 2022: ఇవాళ (శుక్రవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 46 పాయింట్లు లేదా 0.25 శాతం గ్రీన్‌ కలర్‌లో 18,929 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 


నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:


విప్రో: విప్రో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీరింగ్‌కు చెందిన ఇండస్ట్రియల్ ఆటోమేషన్ బిజినెస్‌ విభాగం, పుణెకు చెందిన ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) ప్రొడక్ట్ స్టార్టప్ అయిన లైన్‌క్రాఫ్ట్‌.ఏఐని (Linecraft.ai) కొనుగోలు చేయడానికి ఒక ఒప్పందంపై సంతకం చేసింది. 


కోటక్ మహీంద్ర బ్యాంక్: ఒక్కోక్కటి రూ.10 లక్షల ముఖ విలువతో ఉన్న 15,000 లాంగ్ టర్మ్ ఫుల్లీ పెయిడప్‌ నాన్ కన్వర్టబుల్ బాండ్లను ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ప్రాతిపదికన కేటాయించింది. కూపన్ రేటు సంవత్సరానికి 7.63 శాతం. కాలపరిమితి కేటాయింపు తేదీ నుంచి 7 సంవత్సరాలు.


వన్97 కమ్యూనికేషన్స్ (పేటీఎం): కంపెనీ వ్యవస్థాపకుడు, CEO విజయ్ శేఖర్ శర్మ చెబుతున్న ప్రకారం... పేమెంట్స్‌ బిజినెస్‌లో UPI వాటా పెరుగుదల కారణంగా ఈ డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ బ్లెండెడ్ నెట్‌ పేమెంట్‌ మార్జిన్‌ 5 నుంచి 7 బేసిస్ పాయింట్ల వద్ద స్టెబిలైజ్‌ అవుతుందని ఆశిస్తున్నారు. చెల్లింపు ఆదాయాల నుంచి చెల్లింపు ప్రాసెసింగ్ ఛార్జీలు తీసేస్తే వచ్చే దానిని నికర చెల్లింపు మార్జిన్‌గా లెక్క వేస్తారు.


NMDC: NMDC నాగర్నార్ స్టీల్ ప్లాంట్ విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక బిడ్లను ఆహ్వానించింది. బిడ్లు సమర్పించడానికి చివరి తేదీ జనవరి 27, 2023. ప్రశ్నలు అడగడానికి చివరి తేదీగా డిసెంబర్ 29, 2022ను 'డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్‌ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్' (దీపమ్‌) వెల్లడించింది.


యస్ బ్యాంక్: ప్రైవేట్ ఈక్విటీ మేజర్‌ కంపెనీలు ది కార్లైల్ గ్రూప్, అడ్వెంట్ ఈ ప్రైవేట్ బ్యాంక్‌లో 9.99 శాతం వరకు వాటాను హోల్డ్‌ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆమోదం తెలిపింది. రెగ్యులేటరీ అనుమతులకు లోబడి, యెస్ బ్యాంక్‌లో రూ. 8,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టాలని ఈ ఏడాది జులైలో ఈ రెండు PE ఫండ్స్‌ అభిప్రాయం వ్యక్తం చేశాయి. ఏ బ్యాంక్‌లోనైనా 5 శాతం కంటే ఎక్కువ వాటా కలిగి ఉండటానికి రెగ్యులేటరీ ఆమోదం అవసరం.


ఫీనిక్స్ మిల్స్: ఇండోర్‌లో రూ. 800 కోట్ల పెట్టుబడితో కొత్త షాపింగ్ సెంటర్‌ను 'షాపింగ్ మాల్స్ డెవలపర్ & ఆపరేటర్' ప్రారంభించింది. ఫీనిక్స్ సిటాడెల్ మాల్ పేరిట పిలుస్తున్న ఈ ఫెసిలిటీ 19 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇది దేశంలోనే అతి పెద్దది.


మాక్స్ హెల్త్‌కేర్: జార్జియాలోని టిబిలిసీలో, రెండు ఆసుపత్రుల్లో బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ ప్రోగ్రామ్‌ను ఏర్పాటు చేయడానికి జార్జియాకు చెందిన అతి పెద్ద హెల్త్‌ కేర్ ప్రొవైడర్ ఎవెక్స్ హాస్పిటల్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు మాక్స్‌ హెల్త్‌కేర్ ప్రకటించింది.


బ్యాంక్ ఆఫ్ ఇండియా: బాసెల్ కంప్లైంట్ అడిషనల్ టైర్ 1 (AT-1) బాండ్ల ద్వారా రూ. 1,500 కోట్లను ప్రభుత్వ రంగ రుణదాత సేకరించింది. బాండ్ ఇష్యూ 12 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్ అయింది. కూపన్ రేటు సంవత్సరానికి 8.57 శాతం.


ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్‌ రిటైల్‌: D2C బ్రాండ్ బేవకూఫ్‌లో మెజారిటీ వాటా కోసం రూ. 200 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు ఆదిత్య బిర్లా గ్రూప్ బ్రాండ్స్‌ సంస్థ TMRW తెలిపింది. బేవకూఫ్‌లో 70-80 శాతం మెజారిటీ వాటాను TMRW కొనుగోలు చేసింది. 2012లో ప్రభు కిరణ్ సింగ్ బేవకూఫ్‌ను ప్రారంభిచారు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.