Viral Video: సముద్రంలో వేటకు వెళ్లినప్పుడు మత్స్యకారులు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే చేపల బదులు ఏ తిమింగళమో కంట పడితే అంతే సంగతులు! న్యూజిలాండ్‌లో తాజాగా అలాంటి ఘటనే జరిగింది. విటియాంగాలో ఫిషింగ్ చార్టర్‌లో ఓ బోటులోకి సడెన్‌గా ఒక పెద్ద మాకో షార్క్ (తిమింగళం) దూకింది. ఇది చూసి అక్కుడున్న వారంతా కంగుతిన్నారు.
ఇదీ జరిగింది
విటియాంగా తీరంలో కింగ్‌ఫిష్‌లను వేటాడటానికి కొంతమంది ఒక షిప్‌లో బయలుదేరారు. అయితే అకస్మాత్తుగా ఒక పెద్ద షార్క్ నీటి నుంచి పడవ ముందు భాగంలోకి దూకింది. ఇది చూసి అక్కడున్న వాళ్లు షాకయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో స్టార్‌బోర్డ్ వైపు ఒక వ్యక్తి చేపలు పడుతుండటం కనిపిస్తోంది. అకస్మాత్తుగా పెద్దగా చప్పుడు వినిపిస్తోంది. వెంటనే కెమెరాను పడవ ముందు భాగం వైపు తిప్పే సరికి అక్కడ ఓ పెద్ద తిమింగళం కనిపిస్తుంది.
షార్ట్‌ఫిన్ మాకో షార్క్ అని కూడా పిలిచే మాకో షార్క్ 12 అడుగుల పొడవు వరకు పెరుగుతుంది. ఇది 1,200 పౌండ్ల బరువు ఉంటుంది. ఇవి అత్యంత వేగవంతమైన సొరచేప జాతుల్లో ఒకటి. ఇవి వేగంగా ఉండటమే కాకుండా అద్భుతంగా దూకగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
Also Read: Viral Video: కాకి ముందు కరాటే చేసిన ఎలుక- ఫన్నీ వీడియో చూశారా?