Viral Video: కాకి, ఎలుక ఫైటింగ్ చేసుకోవడం మీరెప్పుడైనా చూశారా? అవును దాదాపుగా ఇది సాధ్యపడదు. ఎందుకంటే కాకి హాయిగా నింగిలో ఎగురుతుంటుంది. ఎలుక భూమి మీద తిరుగుతుంటుంది. కానీ ఈ వీడియోలో మాత్రం కాకిని భయపెట్టేందుకు ఎలుక చేసి కరాటే నవ్వులు పూయిస్తుంది.
ఇదీ జరిగింది
ఓ కాకిని భయపెట్టడానికి ఎలుక.. కుంగ్-ఫూ, కరాటే చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ కాకి రోడ్డుపై వెళ్తోన్న ఎలుక తోకను పట్టుకుంది. అయితే ఆ చిట్టెలుక మాత్రం తన తెలివి తేటలతో తప్పించుకుంది. కాకిని కోపంగా చూస్తూ.. ఎలుక వింత ఫీట్లు చేసేసరికి ఆ పక్షి భయపడి ఎగిరిపోయింది. ఈ మొత్తం ఘటనను ఓ ఫొటోగ్రాఫర్ చాకచక్యంగా తన కెమెరాలో బంధించాడు.
నాటింగ్‌హామ్‌షైర్‌లో ఆదివారం ఈ ఘటన జరిగింది. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చిట్టెలుక తెలివికి నెటిజన్లు ఫిదా అయిపోయారు.
Also Read: Uttar Pradesh News: బైక్ చక్రంలో ఇరుక్కుపోయిన కోతి- ఎంత కష్టం వచ్చింది!