Viral video: లవర్‌తో షికార్లు చేస్తోన్న తన భర్తను రోడ్డుపైనే చితకబాదింది భార్య. షాపింగ్‌మాల్‌లో భర్తను మరో యువతితో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య.. అందరిముందూ దేహశుద్ధి చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదీ సంగతి
ఉత్తర్‌ప్రదేశ్ ఘజియాబాద్‌కు చెందిన ఓ జంట మధ్య గొడవల కారణంగా భార్య తన పుట్టింట్లో ఉంటోంది. అయితే కార్వా చౌతా పండుగ సందర్భంగా ఆమె తన తల్లితో కలిసి షాపింగ్ చేసేందుకు ఓ మాల్‌కు వెళ్లింది. ఈ సందర్భంగా తన భర్త మరో యువతితో షికార్లు చేస్తూ అదే షాపింగ్ మాల్‌లో కనిపించాడు. దీంతో వారిని పట్టుకుని నిలదీసింది.
భర్త కాలర్ పట్టుకుని నాకు ఎందుకు అన్యాయం చేస్తున్నావంటూ చితకబాదింది. అటు భర్తతో వచ్చిన సదరు యువతిని కూడా ఆమె కుటుంబ సభ్యులు కొట్టారు. దీంతో షాపింగ్ మాల్‌లో పెద్ద సంఖ్యలో జనాలు గుమ్మిగూడారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read: Gujarat, HP Election 2022 Dates: మోగనున్న నగారా- ఆ రెండు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ నేడే విడుదల!