అసలే వర్షాలు పడుతున్నాయి. బయటకు వెళ్లే పరిస్థితి లేదు. బాగా ఆకలేస్తుందని నాలుగు కాయలు తిందామని ఓ ఆన్ లైన్‌ యాప్‌ లో దానిమ్మ గింజలు పెట్టాడు ఓ వ్యక్తి. తీరా ఆర్డర్‌ ఇంటికి వచ్చిన తరువాత తిందామని ఆత్రంగా నోట్లో పెట్టుకుంటే నోరు కాలిపోవడమే కాకుండా.. ఆ గింజలు నెయిల్ పాలిష్‌ వాసన వచ్చాయి.


ఇదంతా కూడా ఓ ప్రముఖ యూట్యూబర్‌ కు జరిగింది. సమ్దీష్‌ భాటియా స్విగ్గీ ఇన్‌ స్టా మార్ట్ నుంచి దానిమ్మ గింజలు ఆర్డర్ చేశాడు. తీరా ఆ గింజలను నోట్లో పెట్టుకుంటే అవి మంటగా అనిపించడంతో పాటు అవి ఓ వింత వాసన కూడా వచ్చాయి.


ఈ విషయాన్ని అంతటిని కూడా సమ్దీష్‌ తన ఇన్‌ స్టా గ్రామ్‌ ఖాతాలో పోస్ట చేశాడు. పోస్ట్ చేయడమే కాకుండా జరిగిన విషయాన్నంతటిని కూడా చాలా వివరంగా తన ఖాతాలో రాసుకొచ్చాడు. దీనిని యూట్యూబర్‌ పోస్ట్‌ చేసిన తరువాత చాలా మంది వీక్షించారు.


అసలు దానిమ్మ గింజలు అలా అవడానికి గల కారణాన్ని కూడా ఓ వ్యక్తి చాలా వివరంగా వివరించాడు. దానిమ్మ గింజలు అలా మంట పుట్టి, నెయిల్‌ పాలిష్‌ వాసన రావడానికి కూడా ఓ శాస్త్రీయ కారణం ఉందంట. ఈస్ట్‌ చక్కెరను తినడం వల్ల దానిమ్మ గింజలు చెడు వాసన, నెయిల్‌ పాలిష్‌ రిమూలర్‌ లాగా మారుతుంది. అందుకే అలాంటి వాటిని తినగానే ఒకలాటి నెయిల్ పాలిష్‌ రిమూవర్‌ వాసన వస్తుందని వివరించారు. దానితో కొందరు ఏకీభవిస్తే..మరికొందరు వారికి తోచిన కామెంట్లు పెట్టుకున్నారు.


దానిమ్మ గింజలు మరింత ఆకర్షణీయంగా, ఎర్రగా కనిపించడానికి నెయిల్‌ పాలిష్‌ వేసి ఉండవచ్చని మరికొందరు తమ అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనప్పటికీ దానిమ్మ గింజలు అలా మారడానికి కారణం ఏదైనా అయి ఉండొచ్చు కానీ..నోరు కాలింది మాత్రం సమ్దీష్‌ దే. 


ఇదే విషయం గురించి స్విగ్గీ వారిని సమ్దీష్‌ అడగగా.. వారి నుంచి వేరే సమాధానం వచ్చింది. సమ్దీష్‌ కి వచ్చిన దానిమ్మ పండుతో పాటు మా ఉత్పత్తులన్ని కూడా చాలా సహజంగా ఉంటాయని వివరించారు. అంతే తప్ప ఎలాంటి హాని కరమైన ప్రొడక్టులను మేము వినియోగించబోమని వారు వివరించారు. అంతే కాకుండా వారి వద్ద ఉండే ఉత్పత్తులన్ని కూడా సహజమైన సువాసనతో ఉంటాయని కస్టమర్లకు ఎలాంటి నష్టం కలిగించవని పేర్కొంది.