Viral News: భార్యకు తెలియకుండా దానమిచ్చిన భర్త- విడాకులిచ్చిన పెళ్లాం, అయ్యో పాపం!

ABP Desam   |  Murali Krishna   |  07 Apr 2022 08:06 PM (IST)

తన భార్య దగ్గర ఓ భర్త నిజం దాచాడు. అయితే దానికి భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. అసలేంటి ఆ నిజం తెలుసా?

భార్యకు తెలియకుండా దానమిచ్చిన భర్త- విడాకులిచ్చిన పెళ్లాం, అయ్యో పాపం!

ఎవరి దగ్గరైన సీక్రెట్స్ దాచొచ్చు కానీ భార్య దగ్గర దాయడం చాలా ప్రమాదకరమని ఎక్కువ మంది భర్తలు నమ్ముతారు. ఎందుకంటే దాచిన ఆ రహస్యం తెలిసిన తర్వాత వాళ్లు భారీ మూల్యం చెల్లించక తప్పదు. తాజాగా ఓ భర్తకు అదే పరిస్థితి ఎందురైంది. తన సతీమణికి తెలియకుండా ఓ దానం చేసిన ఓ భర్తకు.. ఏకంగా ఆమె విడాకులు ఇచ్చేసింది. దానానికే విడాకులు ఏంటి అనుకుంటున్నారా? అయితే మీరే చూడండి.
 
ఏం దానం చేశాడంటే?
 
ఈ విషాద గాథను ఆ భర్త రెడ్డిట్ పోస్ట్‌లో తెలియజేశాడు. అయితే ఈ పోస్ట్‌ బాగా వైరల్ అయింది. కాలేజీలో చదివే రోజుల్లో అతను వీర్యం దానం చేశాడు. పాకెట్ మనీ కోసం ఉపయోగపడుతుంది కదా అని అతను ఇలా చేశాడు. అదే కాలేజీలో తన భార్య కూడా ఆ సమయంలో చదువుతోంది. ఇంతకీ ఆ దానం చేసింది కూడా అదే కాలేజీలో చదివుతోన్న ఓ వ్యక్తికే. 
 
నేను కాలేజీ రోజుల్లో ఉన్నప్పుడు వీర్యం దానం చేశాను. దీని వల్లో కొంత డబ్బులు వస్తాయని అలా చేశాను. అంతేకాకుండా పిల్లలు లేని వారికి దీని వల్ల ఉపయోగం ఉంటుంది కదా అని ఇచ్చాను.                     -                                                 బాధిత భర్త
 
 
కాలేజీ రోజుల్లో వీర్య దానం చేసిన అతను.. చదువు పూర్తయ్యాక మానేశాడు. అయితే తర్వాత రెండేళ్లకు డబ్బులు అవసరమొచ్చి మళ్లీ దానం చేశాడు. అయితే ఈ విషయాన్ని తన భార్య దగ్గర దాచాడు. అయితే అనుకోకుండా పాత స్నేహితులను కలిసిన సమయంలో తన భర్త ఇచ్చిన వీర్య దానం గురించి తనకు తెలిసింది.
 
అయితే తన భార్య మాత్రం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. తన భార్యకు నచ్చజెప్పేందుకు అతను ప్రయత్నించాడు. తనకు వేరే ఎవరూ పిల్లలు లేరని కూడా చెప్పాడు. కానీ ఆమె మాత్రం తన భర్త తనను మోసం చేశాడని బాధపడింది. తర్వాత భర్తకు విడాకుల నోటీసులు పంపింది. భర్తకు తన వల్ల కలిగిన పిల్లలు కాకుండా వేరే కూడా ఉన్నారని ఆమె ఆరోపించింది.

Also Read: Intelligence Report: భారత పవర్ గ్రిడ్‌పై చైనా హ్యాకర్ల దాడి- ఇవేం పనులురా నాయనా?

Also Read: New York Ganesh Temple Street: అమెరికాలో ఓ వీధికి 'గణేశ్ టెంపుల్' పేరు- ఎందుకు పెట్టారంటే?

Published at: 07 Apr 2022 08:03 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.