Titanic Ship Food Menu:


111 సంవత్సరాల క్రితం..


టైటానిక్‌ షిప్ మునిగిపోయి ఈ ఏడాదితో 111 సంవత్సరాలు గడిచిపోయాయి. మానవ చరిత్రలోనే అత్యంత ఘోరమైన ప్రమాదంగా రికార్డుకెక్కిందీ ఘటన. మర్చిపోదామనుకున్నా...మరిపోలేనిది ఈ విషాదం. టైటానిక్ సినిమాలో ఈ ప్రమాదం జరిగిన తీరుని కళ్లకు కట్టినట్టు చూపించారు. ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో టైటానిక్ గురించి చర్చ జరుగుతోంది. చరిత్రలోనే అత్యంత విలాసవంతమైన ఈ షిప్‌లో ప్రతిదీ స్పెషలే. ఇప్పుడు ఎన్ని క్రూజ్‌లు వచ్చినా టైటానిక్‌ ముందు దిగదుడుపే. ఆ షిప్‌లోని ఫెసిలిటీస్ గురించి ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటారు. అందులో అన్నింటి కన్నా హైలైట్‌...ఫుడ్ మెను(Tatanic Food Menu). ఎన్నో నోరూరించే వంటకాలను ప్రయాణికులకు అందించింది టైటానిక్ సిబ్బంది. ప్రస్తుతం ఈ మెనూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాన్‌ వెజ్ ప్రియులను ఉవ్విళ్లూరిస్తోంది. ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ ప్లాట్‌ఫామ్ Taste Atlas ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఈ మెనూని పోస్ట్ చేసింది. మొత్తం మూడు క్లాస్‌లకు సంబంధించిన ఫుడ్ మెనూలనూ పోస్ట్ చేసింది. 






మెనూ ఏంటి..? 


ఫస్ట్ క్లాస్‌ మెనూలో కార్న్‌డ్ బీఫ్, కాకీలీకీ వెజిటేబుల్స్, గ్రిల్డ్ మటన్ చాప్స్, బేక్డ్‌ జాకెట్ పొటాటోస్, కస్టర్డ్ పడ్డింగ్‌తో పాటు స్పైస్డ్ బీఫ్‌ కూడా ఉంది. వీటితో పాటు క్యారెట్, బీట్‌రూట్, టొమాటోలు కూడా ఈ మెనూలో కనిపించాయి. దీనిపైన 1912,ఏప్రిల్ 14 డేట్ కూడా కనిపిస్తోంది. ఇక సెకండ్ క్లాస్‌ మెనూలో అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్‌ రకాలను చేర్చింది. చేపలు, పండ్లు, ఫ్రైడ్ ఎగ్స్, ఫ్రైడ్ పొటాటోస్, టీ, కాఫీ ఉన్నాయి. థర్డ్ క్లాస్ మెనూలో ఎగ్స్, బ్రెడ్, బట్టర్, టీ, కాఫీ...బ్రేక్‌ఫాస్ట్ మెనూలో చేర్చింది. డిన్నర్‌కి స్పెషల్స్‌ లిస్ట్ పెట్టింది. సూప్, బ్రెడ్, బ్రౌన్ గ్రేవీ, సాస్, స్వీట్‌లు, పండ్లు, పచ్చళ్లు, రైస్, టీ చేర్చింది. ఈ మెనూలను పోస్ట్ చేసిన  Taste Atlas టైటానిక్ షిప్ మునిగిపోయి 111 సంవత్సరాలు గడిచిపోయాయంటూ గుర్తు చేసుకుంది. ఈ షిప్ మునిగిపోయే ముందు సెకండ్ క్లాస్ ప్యాసింజర్స్ క్రిస్‌మస్ పడ్డింగ్‌ను తింటూ ఆస్వాదించినట్టు చెప్పింది. ఆ తరవాతే అనుకోకుండా ఓ ఐస్‌బర్గ్‌ని ఢీకొట్టి మునిగిపోయింది. దాదాపు 15 వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది తీవ్రంగా గాయపడ్డారు. 1912లో ఏప్రిల్ 14న జరిగిందీ దుర్ఘటన. టైటానిక్ లో 3,500 మంది ప్రయాణించే కెపాసిటీ ఉంది. 1912లో టైటానిక్ మునిగేటప్పుడు 2,200 మంది ప్రయాణికులు, వెయ్యి మంది షిప్ సిబ్బంది ఉన్నారు. 4 రెస్టారెంట్లు, రెండు లైబ్రరీలు, రెండు సెలూన్లు, ఒక స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి. 1912 లో ఈ ఓడను 1985లో సెప్టెంబరు 1 న అట్లాంటిక్ సముద్రంలో దాదాపు  13,000 అడుగున గుర్తించారు. 


Also Read: Arvind Kejriwal: బీజేపీ ఏది చెబితే అది చేయడమేగా సీబీఐ పని,నన్ను అరెస్ట్ చేస్తారేమో - విచారణకు వెళ్లే ముందు కేజ్రీవాల్