Jagananna Vasathi Deevena: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి రేపటి (ఏప్రిల్ 17) అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నార్పల పర్యటన రద్దు అయింది. జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు సీఎం రానున్నట్లుగా ముందుగా ప్రకటన వెలువడింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల నార్పల మండల కేంద్రంలో రేపు జరగబోయే జగనన్న వసతి దీవెన కార్యక్రమం వాయిదా వేస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్‌ ఎమ్‌. గౌతమి ఒక ప్రకటనలో విడుదల చేశారు. కానీ, రేపు సాయంత్రం సీఎం వైఎస్‌ జగన్‌ విజయవాడలో పర్యటించనుండడం యథాతథంగా సాగనుంది. వన్‌ టౌన్‌ విద్యాధరపురంలోని మినీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందు కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు.


ముందుగా ప్రకటించిన అనంతపురం షెడ్యూల్ ఇదీ


రేపు అనంతపురం జిల్లాలో ఏపీ సీఎం జగన్.. జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి ఉంది. బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి ముందు అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నార్పలలో పర్యటించాలి. ఉదయ


8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.20 గంటలకు నార్పల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు


10.40 నుంచి 12.35 గంటల వరకు నార్పల క్రాస్‌రోడ్స్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరు


ప్రజలను ఉద్దేశించిన సీఎం జగన్ ప్రసంగం


అనంతరం జగనన్న వసతి దీవెన కార్యక్రమ ప్రారంభం.. లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ


అనంతరం మధ్యాహ్నం 1.10 గంటలకు అక్కడి నుంచి బయలు దేరి 2.50 గంటలకు తాడేపల్లి నివాసానికి


రేపు సాయంత్రం విజయవాడలో పర్యటన యథాతథం


అలాగే రేపు సాయంత్రం ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విజయవాడలో పర్యటిస్తారు. వన్‌ టౌన్‌ విద్యాధర పురంలోని మినీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందు కార్యక్రమంలో పాల్గొంటారు. ఇందుకోసం సాయంత్రం 5.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 5.45 గంటలకు విద్యాధరపురం మినీ స్టేడియంకు చేరుకుంటారు. 5.45 నుంచి 7.15 గంటల వరకు ఇఫ్తార్‌ విందులో పాల్గొని అనంతరం రాత్రి 7.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.