కొంతమంది ఎంత ప్రయత్నించినా బరువు తగ్గించుకోలేరు. డైట్ పాటిస్తారు, వ్యాయామం చేస్తూనే ఉంటారు. ఆహారంలో నియంత్రణ పాటిస్తారు. కానీ ఏవి పని చెయ్యవు ఎందుకని ఎంతో మంది ఆలోచిస్తారు. హార్మోన్ల మార్పుల వల్ల వయసు పెరిగే కొద్ది బరువు తగ్గడం చాలా కష్టంగా ఉంటుంది డైట్ నిపుణులు అంటున్నారు. కానీ మీకు తెలియని విషయం ఏమిటంటే శరీరంలో అంతర్లీనంగా వైద్య సమస్య ఉండటం వల్ల ఇలా జరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అటువంటి సమయంలో బరువు పెరగడానికి ఆరోగ్య సంబంధిత కారణాలు ఉంటాయి.


హైపోథైరాయిడిజం


బరువు పెరగడం, అలసట, పొడి చర్మం, వెంట్రుకలు సన్నగా మారడం వంటి ఇంతర లక్షణాలు మీలో కనిపిస్తే మాత్రం హైపోథైరాయిడిజానికి సంకేతం కావచ్చు. సీతాకోకచిలుక ఆకారంలో ఉన్న థైరాయిడ్ గ్రంథి తగినంత హార్మోన్లని ఉత్పత్తి చేయకపోతే ఈ సమస్య ఏర్పడుతుంది.


అమెరికన్ థైరాయిడ్ అసోసియేషన్ ప్రకారం ఎనిమిది మంది మహిళల్లో ఒకరు థైరాయిడ్ రుగ్మతతో బాధపడుతున్నారు. దీని వల్ల శరీర విధులు సరిగా నిర్వరించలేవు.


పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ లేదా పీసీఓఎస్


పీసీఓఎస్ అనేసి ఎండోక్రైన్ రుగ్మత. దీనిలో ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్ వంటి హార్మోన్లు సరిగా ఉత్పత్తి చేయలేవు. ఈ అసంతుల్యత కారణంగా  బరువు సమస్యలతో పాటు క్రమరహిత పీరియడ్స్, నొప్పులు, మొటిమల పెరుగుతాయి. పీసీఓఎస్ కి చికిత్స లేనప్పటికీ జీవనశైలిలో మార్పులు మందులతో పరిస్థితిని అదుపులోకి తెచ్చుకోవచ్చు. పీసీఓఎస్ సమస్య ఉన్న మహిళలు గర్భం ధరించడంలో ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ గర్భం వచ్చినా అనుకోని కారణాల వల్ల గర్భస్రావం అయ్యే అవకాశాలు ఉన్నాయి.


ఒత్తిడి, ఆందోళన


డిప్రెషన్, ఒత్తిడి, ఆందోళన శరీరాన్ని నాశనం చేస్తాయి. ఆకలిని కోల్పోతారు. కొన్ని సార్లు తమ భావాలని ఎదుర్కోవడానికి అనారోగ్యకరమైన ఆహారాలను అతిగా తింటారు. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ బిహేవియరల్ న్యూట్రిషన్ అండ్ ఫిజికల్ యాక్టివిటీలో ప్రచురితమైన 2019 అధ్యయనం ప్రకారం ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన వల్ల బరువు అదుపులో ఉండదని వెల్లడైంది. అంతే కాదు దీని వల్ల అలసట, చిరాకు, ఏకాగ్రత లోపిస్తుంది.


గర్భాశయంలో కణితి


గర్భాశయం లేదా అండాశయాలలో కణితి ఉంటే దాన్ని తెలుసుకోవడం చాలా కష్టం. ఇది తీవ్రమైన పరిస్థితి. చికిత్స చేయకుండా వదిలేస్తే పెద్ద పెల్విక్ ఏరియా ట్యూమర్ లు పొట్టలో ఉబ్బరం, వాపుని కలిగిస్తాయి. దీని వల్ల కూడా బరువు పెరుగుతారు.


అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం బరువు పెరగడమే కాకుండా కణితులు వల్ల వెన్ను నొప్పు, రక్తస్రావం, సెక్స్ చేసేటప్పుడు బాధకలిగించే నొప్పు, మలబద్ధకం వంటి సమస్యలు ఎదురవుతాయి.


నిద్రలేమి


సరైన నిద్రలేకపోవడం ఆరోగ్యానికి చాలా హానికరం. ఆకలిని నియంత్రించే హార్మోన్లలో గందరగోళం ఏర్పడతాయి.  గ్రెలిన్ స్థాయిలను పెంచుతుంది. ఇది ఎప్పుడు తినాలని చెప్పే హార్మోన్ల. ఒబేసిటీ జర్నల్ ప్రచురించిన అధ్యయనం ప్రకారం పొట్ట నిండింది అని సూచించే లెప్టిన్ అనే హార్మోన్ పని తీరు మందగిస్తుంది. దీని వల్ల అనారోగ్యకరమైన బరువు పెరిగిపోతారు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: డయాబెటిస్ బాధితులు మామిడి పండ్లు తినొచ్చట - కానీ ఈ జాగ్రత్తలు తప్పనిసరి