Viral Video: రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు, సీసీటీవీ ఫుటేజీలు చూస్తే ఒక్కోసారి ఒళ్లు గగుర్పుడుతుంది. అయితే కొంతమంది అజాగ్రత్త వల్ల, నిర్లక్ష్యం వల్ల వేరొకరు బలైపోతుంటారు. అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదీ జరిగింది
రోడ్డుపై నిలిచిన ఓ కారు డోర్‌ను లోపల నుంచి డ్రైవర్ ఒక్కసారిగా తెరిచాడు. దీంతో ఆ కారు పక్కగా బైక్‌పై వెళ్తున్న వారు షాక్ అయ్యారు. బైక్‌ను ఒక్కసారిగా పక్కకు మళ్లించడంతో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టారు. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు ప్రమాదానికి గురయ్యారు. ఇది గమనించిన స్థానికులు ఆ యువకులను కాపాడేందుకు పరుగున వారి వద్దకు వెళ్లారు. అయితే వారి పరిస్థితి ఏమిటన్నది తెలియలేదు.
బెంగళూరు తూర్పు డివిజన్ ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) కళా కృష్ణస్వామి ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఇది పాత వీడియోగా తెలుస్తోంది. 2017 ఏప్రిల్ 19న ఈ ప్రమాదం జరిగినట్లు అందులో ఉంది. బెంగళూరు తూర్పు డివిజన్ ట్రాఫిక్ డీసీపీ కళా కృష్ణస్వామి ఈ వీడియోను ట్విట్టర్‌లో బుధవారం పోస్ట్ చేశారు.
వైరల్
భారీ వర్షాలు, వరదల కారణంగా ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ్ జిల్లాలో పలు ప్రాంతాల్లో ఇటీవల కొండ చరియలు విరిగిపడ్డాయి. తర్సాలి గ్రామ సమీపంలో ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో జాతీయ రహదారి 109 పూర్తిగా మూసుకుపోయింది. రెండు వైపుల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని స్థానికులు హెచ్చరించటం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కొండచరియలు విరిగిపడుతున్నప్పుడు తీసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Also Read: UP Politics: ఎస్‌పీ చీఫ్‌గా మరోసారి అఖిలేశ్- అధికారాన్ని లాగేసుకున్నారని BJPపై విమర్శలు
Also Read: Lakhimpur Bus Accident: గాయపడిన చిన్నారిని చూసి బోరున ఏడ్చిన ఐఏఎస్ ఆఫీసర్!