Vice President Election 2022: నూతన ఉపరాష్ట్రపతిగా బంగాల్ మాజీ గవర్నర్ జగదీప్ ధన్‌ఖడ్ ఎన్నికయ్యారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ అల్వాపై ఎన్‌డీఏ అభ్యర్థి జగదీప్ ధన్‌ఖడ్‌ గెలుపొందారు.


నామినేషన్ నుంచి


ఎన్‌డీఏ అభ్యర్థిగా బరిలోకి దిగిన నాటి నుంచే జగదీప్ ధన్‌ఖడ్‌ విజయం ఖాయమైంది. ఎన్‌డీఏతో పాటు పలు పార్టీలు ధన్‌ఖడ్‌కు మద్దతు ప్రకటించాయి. దీంతో ఆయన గెలుపు లాంఛనమైంది.


రైతు బిడ్డ


దేశంలోని సాధారణ రైతు కుటుంబం నుంచి జగదీప్ ఈ స్థాయికి ఎదిగారు. ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చిన ప్రధాని మోదీ, సహా భాజపా నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.


నా లాంటి సాధారణ వ్యక్తికి ఇంత గొప్ప అవకాశం వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఓ రైతు బిడ్డ ఈ రోజు ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యాడు. ఈ అవకాశం ఇచ్చిన ప్రధాని మోదీ సహా నాయకత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నాను.                                                                              "




- జగదీప్ ధన్‌ఖడ్‌, నూతన ఉపరాష్ట్రపతి



ప్రొఫైల్



  • జగదీప్ ధన్​ఖడ్​ రాజస్థాన్‌లోని ఒక రైతు కుటుంబంలో 1951లో జన్మించారు.

  • చిత్తోడ్‌గఢ్‌ సైనిక స్కూల్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన భౌతికశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు.

  • రాజస్థాన్‌ విశ్వవిద్యాలయం నుంచి న్యాయవిద్యను అభ్యసించారు.

  • రాజకీయాల్లోకి రాకముందు వ్యవసాయం చేశారు. కిసాన్‌పుత్ర అనే గుర్తింపు సాధించారు. 

  • ప్రముఖ న్యాయవాదిగా గుర్తింపు పొందారు ధన్‌ఖడ్‌.

  • రాజస్థాన్‌ హైకోర్టు, సుప్రీం కోర్టులోనూ ప్రాక్టీస్‌ చేశారు.

  • రాజస్థాన్‌ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా పని చేశారు.

  • బంగాల్ గవర్నర్‌గా పనిచేశారు.


Also Read: VP Poll Result: జగదీప్ ధన్‌ఖడ్‌కు శుభాకాంక్షల వెల్లువ- ఇంటికి వెళ్లిన ప్రధాని మోదీ


Also Read: Vice President Election 2022: ఉపరాష్ట్రపతి పీఠంపై రైతు బిడ్డ- ఎన్నికల్లో జగదీప్ ధన్‌ఖడ్‌ విజయం