Died After Drinking Tea: ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం జరిగింది. విష రసాయనాలు కలిసిన టీ తాగి ఇద్దరు చిన్నారులు, వారి తండ్రి సహా ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Continues below advertisement


ఇదీ జరిగింది


మెయిన్‌పురి జిల్లా నగ్లా కన్హాయ్‌ గ్రామంలో ఈ విషాదం జరిగింది. గ్రామానికి చెందిన ఓ మహిళ గురువారం తన ఇంట్లో టీ పొడిగా పొరపడి, పొలంలో పిచికారీ చేసిన పురుగుల మందు డబ్బాలోని పౌడర్‌ను వేసి టీ కాచింది.


ఇది తాగిన భర్త శివనందన్‌ (35), కుమారులు శివాంగ్‌ (6), దివ్యాన్ష్‌ (5)తో పాటు తన తండ్రి రవీంద్ర సింగ్‌ (55), పొరుగునుండే సొబ్రాన్‌ (42)లకు ఇచ్చిది. తాగిన తర్వాత వీరంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రవీంద్ర సింగ్, శివాంగ్, దివాన్ష్‌ ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే చనిపోయారు. మిగిలిన ఇద్దరూ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Also Read: Russia Ukraine War: అణ్వాయుధాల ప్రయోగంపై పుతిన్ కీలక వ్యాఖ్యలు!