Russia Ukraine War: అణ్వాయుధాల ప్రయోగంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలను ప్రయోగించే ఉద్దేశం తమకు లేదని పుతిన్ స్పష్టం చేశారు.
బైడెన్
ఉక్రెయిన్‌లో అణ్వాయుధాలను ఉపయోగించాలని రష్యా ప్రయత్నాలు చేస్తున్నట్లు వచ్చిన వార్తలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రష్యా చేసే తీవ్రమైన తప్పుగా అమెరికా భావిస్తుందని బైడెన్ అన్నారు.
యూరోప్‌లోని అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్ వద్ద రష్యా తన అణు సామర్థ్యాలపై సాధారణ కసరత్తులను నిర్వహించాలని యోచిస్తున్నట్లు ఉక్రెయిన్ ఆరోపించింది. దీనిపై బైడెన్ ఘాటుగా స్పందించారు.
" రష్యా వ్యూహాత్మక అణ్వాయుధాన్ని ఉపయోగిస్తే అది చాలా తీవ్రమైన తప్పు అవుతుంది. రష్యా అణ్వాయుధాలను ఉపయోగిస్తుందా లేదా అనే దానిపై నేను ఏమీ చెప్పలేను. కానీ ఒక వేళ వినియోగిస్తే అది తీవ్రమైన పొరపాటు అవుతుంది. "
ఉక్రెయిన్‌లో ఆక్రమించిన భూభాగాలను కాపాడుకొనేందుకు తనకు ఉన్న దారులు మూసుకుపోతే అణుదాడి చేస్తానని పుతిన్ ఇటీవల హెచ్చరించారు.
"ఉక్రెయిన్‌లోని రష్యా నియంత్రణలోని గల భూభాగాల్లోని ప్రజలు.. నియో నాజీల పాలనలో ఉండాలని కోరుకోవడం లేదు. వారికి స్వేచ్ఛ కల్పిస్తాం. పశ్చిమ దేశాలను రష్యాను బ్లాక్ మెయిల్ చేస్తున్నాయి. కానీ ఆ బెదిరింపులకు రష్యా తలొగ్గదు. ఎందుకంటే వారి హెచ్చరికలను ఎదుర్కొనే ఆయుధ సంపత్తి మా సొంతం. హద్దులు దాటిన ఐరోపా దేశాలు ఇది గుర్తు పెట్టుకోవాలి. మా ప్రాదేశిక సమగ్రతకు ముప్పు వాటిల్లితే అణ్వాయుధాలను ప్రయోగించడానికి కూడా మేం వెనుకాడం. "