Bombay High Court: వివాహితకు అత్తింటివారు ఇంటి పనులు చేయాలని చెప్పడం క్రూరత్వం కాదని బాంబే హైకోర్టు (Bombay High Court) వ్యాఖ్యానించింది. ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు ఇలా స్పందించింది.
ఒక వివాహితను ఇంటి పని చేయమని అడిగితే కచ్చితంగా అది కుటుంబ అవసరాల కోసమే. అంతేకానీ ఆమెను పని మనిషిలా చూస్తున్నట్లు కాదు. ఆమెకు ఇంటి పనులు చేయాలనే ఉద్దేశం లేకపోతే ఆమె పెళ్లికి ముందే ఆ విషయం వరుడి కుటుంబానికి చెప్పాలి. అప్పుడు వాళ్లు వివాహం గురించి పునరాలోచించుకుంటారు. పెళ్లికి ముందే ఇలాంటి సమస్యను పరిష్కరించుకోవాలి. - బాంబే హైకోర్టు
ఇలా పిటిషన్
పెళ్లయిన తర్వాత నెల రోజుల వరకు అంతా బాగానే ఉందని, ఆ తర్వాత నుంచి అత్తింటి వారు తనను పని మనిషిలా చూస్తున్నారని ఓ మహిళ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇంటి పనంతా తనతోనే చేయిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొంది.
నా భర్త, అతని కుటుంబ సభ్యులు కారు కొనుగోలు చేసేందుకు నా తండ్రి దగ్గరకు వెళ్లి రూ. 4 లక్షలు తీసుకురావాలని బలవంతం చేశారు. నా తండ్రికి అంత ఆర్థిక స్థోమత లేదని చెప్పినా భర్త, అత్తమామలు నన్న మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారు. కొడుకు పుట్టడం కోసం భర్త కుటుంబీకులు నన్ను వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లారు. రూ.4 లక్షలు ఇస్తేనే భర్తతో కాపురం చేయినిస్తామని నా అత్తగారు మా పుట్టింటికి వెళ్లి చెప్పారు. ఆ సమయంలో వారు నాపై దాడి చేశారు. - పిటిషన్‌లో మహిళ ఆరోపణలు
ఇలా తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. అనంతరం ఈ కేసులో మహిళ.. తన భర్త, అతడి తల్లిదండ్రులపై చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని చెబుతూ కోర్టు కేసును కొట్టివేసింది.
Also Read: Hindu Holocaust Memorial: 'హిందువుల మద్దతుతోనే అప్పుడు గెలిచా- మళ్లీ అధికారంలోకి వస్తే'