Vladimir Putin Praises Modi:


ప్రధాని మోదీపై ప్రశంసల జల్లు..


రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్...భారత ప్రధాని మోదీని ఆకాశానికెత్తారు. భారత్, రష్యా మధ్య ఉన్న సత్సంబంధాల గురించి చర్చించే సమయంలో మోదీపై ప్రశంసలు కురిపించారు. మాస్కోలో నిర్వహించినValdai Discussion Club సమావేశంలో పుతిన్..మోదీపై చేసిన వ్యాఖ్యలపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. ఇంటర్నేషనల్ మీడియా కూడా దీనిపై ఫోకస్ పెట్టింది. "నరేంద్ర మోదీ నిజమైన దేశభక్తుడు. స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అమలు చేసే అతి కొద్ద మంది అధినేతలలో ఆయన ఒకరు. ప్రజల అభిప్రాయాలను ఎలా గౌరవించాలో ఆయనకు తెలుసు. చాలా దేశాలు భారత్‌పై ఆంక్షలు విధించాలని చూశాయి. కానీ మోదీ మాత్రం ఆ ప్రయత్నాలన్నింటినీ తిప్పికొట్టారు. అభివృద్ధి విషయంలో భారత్ ఎంతో సాధించింది. ఆ దేశానికి ఎంతో మంచి భవిష్యత్ ఉంది" అని వ్యాఖ్యానించారు పుతిన్. అంతే కాదు. భారత్, రష్యా సంబంధాల గురించీ ప్రస్తావించారు.


"దశాబ్దాలుగా భారత్, రష్యా మధ్య మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ రెండు దేశాల మధ్య ఎలాంటి విభేదాలు లేవు. బ్రిటీష్‌ పాలనలో మగ్గి..ఆ తరవాత స్వతంత్ర దేశంగా మారి భారత్ ఎంతో సాధించింది. ఇప్పుడు ప్రపంచమంతా గౌరవించే స్థాయికి చేరుకుంది. అదంతా ఆ అభివృద్ధి కారణంగానే" అని వెల్లడించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్‌లో ఎన్నో సంస్కరణలు వచ్చాయని కితాబిచ్చారు. "మోదీ నేతృత్వంలో భారత్‌లో చాలా మార్పులు వచ్చాయి. ఆయన స్వతహాగానే  ఓ దేశభక్తుడు. అందుకే Make in India లాంటి కార్యక్రమాలతో దేశభక్తిని చాటుకున్నారు. ఆర్థికంగా భారత్‌ను సుస్థిరం చేయాలని భావించారు. భవిష్యత్ అంతా భారత్‌దే. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఎదిగే సత్తా భారత్‌కు ఉంది. భారత్, రష్యా మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉంది. వాణిజ్యపరంగా మునుపటి కన్నా బలోపేతం అయ్యాం. ఫర్టిలైజర్‌ల ఎగుమతిని పెంచాలని ప్రధాని మోదీ అడిగారు. అందుకే...ఇప్పుడు మా దేశం నుంచి వాటి ఎగుమతులు 7.6 రెట్లు పెరిగాయి" అని స్పష్టం చేశారు. 


ఎస్‌సీఓ సదస్సులో..


ఎస్‌సీఓ సమ్మిట్‌లో...ప్రధాని మోదీ పుతిన్‌తో యుద్ధం ఆపేయాలని సూచించారు. "వీలైనంత త్వరగా యుద్ధం ఆపివేయటం మంచిది" అని చెప్పారు. అయితే..దీనిపై రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందించారు. "ఉక్రెయిన్ విషయంలో మీ (భారత్) ఎటు వైపు ఉందో తెలుసు. మీ ఆందోళనలేంటో కూడా అర్థం చేసుకోగలను. ఈ యుద్ధాన్ని త్వరగా ఆపేయాలని మేమూ కోరుకుంటున్నాం. కానీ..ఉక్రెయిన్ ఇందుకు సహకరించటం లేదు. చర్చల విషయంలో ముందడుగు వేయటం లేదు. వాళ్ల డిమాండ్‌లు నెరవేర్చాలని మొండి పట్టు పడుతున్నాయి. 
అక్కడ ఏం జరుగుతోందన్నది ఎప్పటికప్పుడు మీకు చెబుతూనే ఉంటాం" అని ప్రధాని మోదీకి వివరించారు పుతిన్. మొత్తానికి ఎస్‌సీఓ వేదికగా...పుతిన్‌కు ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి పెరిగినట్టు స్పష్టమవుతోంది. రష్యాకు మైత్రి దేశంగా ఉన్న భారత్‌ కూడా స్పందించటం వల్ల ప్రాధాన్యత పెరిగింది. భారత్‌తో ఉన్న సంబంధాలను చాలా వ్యూహాత్మకమైనవి అని పుతిన్ అంగీకరించారు కూడా. 


Also Read: Reserve Bank of India: ఆర్‌బీఐ ఎంపీసీ సర్‌ప్రైజ్‌ మీటింగ్‌, ద్రవ్యోల్బణంపై కేంద్రానికి సమాధానం చెప్పాలట!