రువు తగ్గడానికి, ఫిట్ గా ఉండటం కోసం అందరూ వ్యాయామం చేస్తారు. కానీ చాలా మందికి ఇది ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం కలిగేలా చేస్తుంది. జిమ్ లో బరువులు ఎత్తడం, రకరకాల ఎక్సర్ సైజులు చేయడం చేసి కష్టపడిపోతూ ఉంటారు. నిజానికి వ్యాయామం చేయడం వల్ల సంతోషాన్ని కలిగించే హార్మోన్లను విడుదల చేసేందుకు సహాయపడుతుంది. ఒత్తిడి జీవక్రియ, రక్తపోటు, కొలెస్ట్రాల్, శరీర బరువును కూడా నియంత్రణలో ఉంచేందుకు సహకరిస్తాయని కొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వారానికి కనీసం 150 నిమిషాల వ్యాయామం చేయడం ఆరోగ్యకరమని వైద్యులు కూడా సిఫార్సు చేస్తారు. ఫిట్ నెస్ కోసమే కాదు మీ మూడ్ మార్చి సంతోషంగా ఉండేందుకు కేవలం 8 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే సరిపోతుందని కొందరు మనస్తత్వవేత్తలు చెబుతున్నారు. దీన్నే జాయ్ వర్కౌట్ అని కూడా పిలుస్తున్నారు.


జాయ్ వర్కౌట్ ఎలా చెయ్యాలి?


జాయ్ వర్కౌట్ చేయడం వల్ల మానసిక ప్రశాంతత, ఆనందం కలుగుతుంది. కాళ్ళు, చేతులు కదిలిస్తూ సంతోషంగా చిన్న చిన్న జంపింగ్ ట్రిక్స్ పాటిస్తే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల వెన్నెముక కూడా ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. కొద్దిసేపు వ్యాయామం మానసిక పరిస్థితిని పెంచుతుందని అధ్యయనాలు వెల్లడించాయి. క్రమం తప్పకుండా రోజుకు ఎనిమిది నిమిషాల పాటు ఈ జాయ్ వర్కౌట్ చేయడం వల్ల ఆనందంగా ఉంటారు. శరీరాన్ని కదిలించడం వల్ల ఆనందం పొందవచ్చని నిపుణులు చెప్పుకొచ్చారు.


☀ మీకు నచ్చిన పాట లేదా మ్యూజిక్ పెట్టుకుని వ్యాయామ చేయడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది.


☀ ఫ్రెండ్స్ లేదా కుటుంబ సభ్యులతో కలిసి బయటకి వెళ్ళడానికి ప్రయత్నించండి.


☀ ఇష్టమైన ఆట ఆడుతూ కూడా స్నేహితులతో సరదాగా పోటి పెట్టుకోవచ్చు.


☀ పచ్చదనం ఎక్కువగా ఉండే పార్కులు ఉద్యానవనంలో మీకు ఇష్టమైన సంగీతం వింటూ జాగింగ్ లేదా సైక్లింగ్ సెషన్ చెయ్యొచ్చు.


☀ ఇష్టమైన పాట పెట్టుకుని డాన్స్ చేయడం కూడా వ్యాయామం కిందకే వస్తుంది.


జాయ్ వర్కౌట్ కాస్త జుంబా మాదిరిగానే ఉంటుంది. ప్రస్తుతం మహిళలు జిమ్ కంటే ఎక్కువగా జుంబా డాన్స్ క్లాస్ కి వెళ్లేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో కూడా పాటలు పెట్టుకుని శరీరం మొత్తం కదిలించే విధంగా స్టెప్స్ వేస్తూ ఎంజాయ్ చెయ్యొచ్చు. ఇప్పుడు ఈ జుంబాకి ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. ఎటువంటి ఒత్తిడి లేకుండా హాయిగా జీవించేందుకు జాయ్ వర్కౌట్ అనువుగా ఉంటుందని న్యూయార్క్ లో దీన్ని పాటిస్తున్న కొందరు వ్యక్తులు చెప్తున్నారు.


Also Read: ప్రపంచానికి పొంచి ఉన్న మరో ముప్పు- ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ సోకితే ప్రాణాలు నిలవడం కష్టమే: WHO


జాయ్ వర్కౌట్ ద్వారా ఆరు సంతోషకరమైన అనుభూతులని పొందవచ్చు. ఎగరడం, బౌన్స్, చేతులు ఊపడం వంటివి ఈ వర్కౌట్ లో ఉంటాయి. దీనికి సంబంధించి వీడియో కింద చూడవచ్చు.