Sarco Suicide Pad Case: అమెరికాకు చెందిన ఒక మహిళ సార్కో సూసైడ్ పాడ్ సాయంతో ఆత్మహత్యకు పాల్పడి చనిపోయింది. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించడంతో తయారీ సంస్థపై స్విస్టర్‌ల్యాండ్ పోలీసులు కేసులు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు. అనాయాస మరణం లేదా ఎథునేసియా కోసం తయారు చేసిన సార్కో సూసైడ్ పాడ్ అంటే ఏంటి?  అది ఎలా పనిచేస్తుంది?


స్విస్‌లో తయారై అమెరికా మహిళ ఉసురు తీసిన సూసైడ్‌ మెషిన్‌:


అమెరికాకు చెందిన 62 ఏళ్ల మహిళ సోమవారం (సెప్టెంబర్ 23)సాయంత్రం జర్మనీ బార్డర్‌కు దగ్గర్లో ఈ సార్కో సూసైడ్ పాడ్ సాయంతో ఆత్మహత్యకు పాల్పడింది. షఫాయ్‌సేన్‌లోని ఓ అడవిలోని చిన్న హట్‌లో ఈ ఘటన జరిగింది. దీనిపై విచారణ చేపట్టిన స్విస్ పోలీసులు ఈ ఘటనతో సంబంధం ఉన్న పలవురుని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.


సార్కో పాడ్ అంటే ఏంటి?


సార్కో అన్నది సార్కొఫాగస్‌కు షార్ట్ ఫామ్‌. సార్కొఫాగస్ అంటే శవపేటిక అని అర్థం. ఈ సార్కొపాడ్‌ను ఆత్యహత్యాపేటిక అని కూడా అంటారు. సార్కొపాడ్‌ను అనాయాస మరణం కోసం వినియోగిస్తారు. ఇది ఒక స్టాండ్‌పై విడదీయడానికి అనువుగా ఉండే త్రీడీ ప్రింటింగ్ క్యాప్సూల్‌. ఇందులో లిక్విడ్‌ నైట్రోజన్‌ ఛాంబర్ ఉంటుంది. ఈ పేటికలోకి వెళ్లిన వారు ఆ గ్యాస్ పీల్చుకొని మరణించేలా ఏర్పాటు చేశారు. ఈ ఆత్మహత్యా పేటికను తొలిసారి 2019లో స్విట్జర్లాండ్‌లో ఉపయోగించారు. దీనిపై వివాదం మొదలవగా సార్కోపాడ్ వినియోగంపై స్విట్జర్లాండ్ నిషేధం ఉంది. స్విట్జర్లాండ్ లో యాక్టివ్ ఎథునేసియాపై నిషేధం ఉండగా అసిస్టిండ్‌ డైయింగ్‌కు లీగల్ అనుమతులు ఉన్నాయి. ప్రస్తుత యూఎస్ మహిళ అసిస్టింగ్ డైయింగ్ సాయంతో చనిపోయినప్పటికీ సార్కొపాడ్‌ సాయంతో ఆత్మహత్యకు మాత్రం లీగల్‌గా అనుమతులు లేవు.






సార్క్ పాడ్ ఎలా చంపేస్తుంది?


సార్కోపాడ్‌లోకి మనిషి వెళ్లిన తర్వాత ఆ ఛాంబర్‌ను క్లోజ్ చేసి అందులో ఆక్సిజన్ బదులు లిక్విడ్ నైట్రోజన్ వదులుతారు. ఈ లిక్విడ్‌ నైట్రోజన్ పీల్చడం వల్ల సదరు వ్యక్తి హైపోక్జియాతో మరణిస్తారు. ఈ క్యాప్సుల్‌లోకి వెళ్లే ముందు జరిగే సైకియాట్రిస్ట్ టెస్టులో ఎథునేసియా కోరుకుంటున్న వ్యక్తి పాస్‌ అవ్వాల్సి ఉంటుంది. క్యాప్సుల్‌లోకి వెళ్లిన తర్వాత అడిగే కొన్ని ఆటోమేటిక్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే బటన్ ప్రెస్ అవుతుంది. ఈ ప్రశ్నలకు సరైన సమాధానం లభిస్తే బటన్ ప్రెస్ అయ్యి అందులోకి లిక్విడ్ నైట్రోజన్ పంపింగ్ జరుగుతుంది. క్రమంగా ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయి మనిషి అన్‌కాన్సియస్‌లోకి వెళ్తాడు. ఆ తర్వాత 10 నిమిషాల్లో చనిపోతారు. ఈ పది నిమిషాల్లో మనిషికి బతకాలన్న ఆలోచన వస్తే తనకు తానుగా లోపల ఉన్న ఒక బటన్ సాయంతో క్యాప్సుల్ ఓపెన్ చేయొచ్చు. 1940 నుంచి అసిస్టింగ్ డైయింగ్ స్విట్జర్‌ల్యాండ్‌లో అమల్లో ఉంది.


ప్రశాంతమైన, గౌరవప్రదమైన, త్వరితగతిన దొరికే చావు:


ఈ క్యాప్సూల్‌ ద్వారా చనిపోవాలని అనుకునే వారికి ప్రశాంతమైన, గౌరవ ప్రదమైన చావు లభిస్తుందని .. అలాంటి చావునే అమెరికన్ మహిళ పొందారని సార్కొపాడ్‌ తయారు చేసిన ఫిలిప్ నిక్‌షాట్ అన్నారు. ఇతడు ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తి. సార్కొపాడ్‌ను ఇతడే రూపొందించారు. ఆ పేటికలోకి వెళ్లిన రెండు నిమిషాల్లోనే సదరు మహిళ స్పృహ కోల్పోయి ఉంటారని, ఐదు నిమిషాల్లోనే మరణించి ఉంటారని ఫిలిప్ అంచనా వేశారు. ఆత్మహత్యకు పాల్పడిన సదరు అమెరికన్ మహిళ కొన్నేళ్లుగా వివిధ అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారని తెలిపారు. ఆమె కోరుకున్న విధంగానే ఆమెకు ఈ సార్కోపాడ్ గౌరవప్రదమైన బాధారహితమైన మరణాన్ని అందించిందని దిగార్డియన్‌ పత్రికతో ఫిలిఫ్ చెప్పారు.


ఈ క్యాప్సూల్‌ స్విట్జర్‌లాండ్‌లోని ఆర్టికల్ 115కి వ్యతిరేకంగా ఉందని విమర్శలు ఉన్నాయి. ఇది ఎవరైనా ఉద్దేశ్య పూర్వకంగా ఇతరుల హత్యకు వినియోగించే అవకాశం ఉందని కొందరు ఆరోపిస్తున్నారు. పూర్తిగా దీనిని నిషేధించాలని డిమాండ్లు ఉన్నాయి.