US EAD Cards:
ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ కార్డ్‌లు..
అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో వేలాది మంది భారతీయులకు మేలు జరగనుంది. నాన్ ఇమిగ్రెంట్ కేటగిరీకి చెందిన పౌరులకు ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ కార్డ్‌లు (US Employment Authorisation Cards) జారీ చేయనుంది. గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూసే వాళ్లకీ ఈ కార్డ్‌లు ఇవ్వనుంది. ఐదేళ్ల పాటు ఇది చెల్లుతుంది. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న భారతీయులకు ఇదెంతగానో ఉపయోగపడనుంది. US Citizenship and Immigration Services (USCIS) ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. Employment Authorization Documents (EAD) వ్యాలిడిటీని ఐదేళ్ల వరకూ పెంచుతున్నట్టు వెల్లడించింది. గ్రీన్ కార్డ్ కోసం అప్లై చేసుకుని ఎదురు చూస్తున్న వాళ్లకీ ఇది లబ్ధి చేకూర్చనుంది. సాధారణంగా గ్రీన్ కార్డ్‌లు అప్లై చేసిన వాళ్లకి "అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్ అప్లికేషన్స్" చాలా కీలకం. గ్రీన్ కార్డ్ రావాలంటే ఈ ప్రాసెస్ దాటుకుని రావాల్సిందే. ఇక్కడే చాలా వరకూ పెండింగ్‌లో ఉంటాయి. ఇకపై ఈ స్టేటస్‌తో సంబంధం లేకుండా ఐదేళ్ల పాటు ఎంప్లాయ్‌మెంట్ కార్డ్‌లు ఇవ్వనుంది అమెరికా వలసల విభాగం.
గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్లు ఈ ఎంప్లాయ్‌మెంట్ కార్డుతో అమెరికాలో ఉద్యోగం చేసుకోవచ్చు. ప్రస్తుత లెక్కల ప్రకారం..అమెరికాలో కనీసం 10.5 లక్షల మంది భారతీయులు ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 23 నుంచి పెండింగ్‌లో ఉన్న అప్లికేషన్‌లకు ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ కార్డ్‌లు వర్తిస్తాయి. గ్రీన్ కార్డ్ (US Green Card)వచ్చిందంటే అమెరికా పౌరసత్వం లభించినట్టే. అంటే...అమెరికాలోనే శాశ్వతంగా ఉండేందుకు ఆ దేశం అనుమతినిస్తుంది. చాలా మంది వీటి కోసం ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. H1B వీసాదారుల జీవిత భాగస్వాములు లేదా 21 ఏళ్ల లోపు యువతీ యువకులు అమెరికాలో ఉద్యోగం చేసుకోడాని H4 వీసాలు ఇస్తారు. అయితే...వీళ్లు జాబ్ చేయాలంటే కచ్చితంగా ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేన్ డాక్యుమెంట్స్ కోసం అప్లై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ పూర్తైతే తప్ప ఉద్యోగం చేయడానికి అవకాశముండదు. ఇది పూర్తి కావాలంటే ఒక్కోసారి ఏడాది సమయం పడుతుంది. ఇలాంటి వాళ్లకి ఇకపై ఇబ్బందులు తలెత్తకుండా EADల గడువుని ఐదేళ్ల వరకూ పెంచారు.
వీసాల సంఖ్య పెరిగింది..
ఈ వేసవిలో రికార్డు స్థాయిలో స్టూడెంట్ వీసాలు జారీ చేశామని, మొత్తం 90 వేలు మించిపోయాయని భారత్ లోని యునైటెడ్ స్టేట్స్ ఎంబసీ ఇటీవలే వెల్లడించింది. జూన్, జులై, ఆగస్టు నెలల్ో వీసాలు జారీ చేసినట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఇంత భారీ మొత్తంలో విద్యార్థి వీసాలు జారీ చేయడం భారత దేశం, అమెరికా మధ్య విద్యా మార్పిడిలో చారిత్రాత్మక మైలురాయిని సూచిస్తుందని పేర్కొంది. ఈ వేసవిలో ప్రపంచవ్యాప్తంగా జారీ అయిన వీసాల్లో అత్యధికంగా భారత్ నుంచే ఉన్నాయని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా జారీ అయిన ప్రతి నాలుగు విద్యార్థి వీసాల్లో ఒకటి భారత దేశంలోనే జారీ చేసినట్లు 2022 లో యునైటెడ్ స్టేట్స్ లో అత్యధిక అంతర్జాతీయ విద్యార్థులతో ప్రపంచంలోని అగ్ర దేశంగా భారత్ చైనాను అధిగమించింది. 2020లో దాదాపు 2,07,000 మంది అంతర్జాతీయ భారతీయ విద్యార్థులు యూఎస్ లో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. యునైటెడ్ స్టేట్స్ ఎంబసీ తెలిపింది. తమ ఉన్నత విద్యా లక్ష్యాలను సాకారం చేసుకోవడానికి యునైటెడ్ స్టేట్స్ ను ఎంచుకున్న విద్యార్థులు అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేసింది. టీమ్ వర్క్, ఇన్నోవేషన్ తో, అర్హత కలిగిన దరఖాస్తుదారులందరూ వారి ప్రోగ్రామ్ లకు సమయానికి చేరుకున్నారని నిర్ధారిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టింది. ప్రస్తుత సెషన్ కోసం స్టూడెంట్ వీసా దరఖాస్తులు ముగిసిన నేపథ్యంలో యూఎస్ మిషన్ ఈ గణాంకాలను విడుదల చేసింది.
Also Read: హమాస్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌ని మట్టుబెట్టిన ఇజ్రాయేల్, ఉగ్రవాదుల్ని ఏరేస్తున్న సైన్యం