Marijuana Drug in US: 


ఆ డ్రగ్ విషయంలోనే..


అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అమెరికన్లకు క్షమాపణలు చెప్పారు. Marijuana అనే డ్రగ్ తీసుకున్నారన్న అనుమానంతో వేలాది మందిని జైల్‌లో పెట్టారు పోలీసులు. దీనిపై స్పందించిన బైడెన్...ఇలా జరిగినందుకు సారీ చెప్పారు. ఈ డ్రగ్‌ను కంట్రోల్ చేసేందుకు కొత్త నిబంధనలు తీసుకొస్తానని స్పష్టం చేశారు. మరో నెల రోజుల్లో అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో..తన మద్దతుదారులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి తీరతానని భరోసా ఇచ్చారు బైడెన్. అయితే...Cannabis (Marijuana) డ్రగ్‌పై పూర్తి స్థాయి నిషేధం విధిస్తామని చెప్పలేదు. "అక్రమ రవాణా, మార్కెటింగ్, మైనర్లకు విక్రయించటం" లాంటి వాటిపై కచ్చితంగా కొరడా ఝుళిపిస్తామని స్పష్టం చేశారు. "ఈ డ్రగ్ తీసుకున్నంత మాత్రాన వాళ్లను జైళ్లలో పెట్టడానికి వీల్లేదు. వేలాది మంది జైలు పాలయ్యారు. వీరికి బయట ఉద్యోగాలు దొరకటం లేదు. ఎవరూ అద్దెకు ఇళ్లు ఇవ్వటం లేదు. ఉన్నత విద్య వైపు వెళ్లాలన్నా కుదరటం లేదు" అని వ్యాఖ్యానించారు బైడెన్. తాను తీసుకునే చర్యలు ఈ బాధితులందరికీ ఉపశమనం కలిగిస్తుందని చెప్పారు. అంతే కాదు. ఈ విషయంలో కొన్ని కండీషన్స్ కూడా పెట్టారు. "కేవలం వ్యక్తిగతంగా మరిజున డ్రగ్ వినియోగించ వాళ్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ...ఆ డ్రగ్‌ను వేరే వాళ్లకు సరఫరా చేసినా, ఉద్దేశపూర్వకంగా ఎవరికైనా ఇచ్చినా చట్టపరమైన చర్యలు ఎదుర్కొంటారని వెల్లడించారు.














రాష్ట్రాల వారీగా గవర్నర్‌లు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించాలని బైడెన్ ఆదేశించారు. "ఎవరూ జైల్‌లో ఉండటానికి వీల్లేదు" అని స్పష్టం చేశారు. దాదాపు 6,500 మంది చట్టపరమైన చర్యలు ఎదుర్కొంటున్నారని, ఇప్పుడు బైడెన్ సారీ చెప్పడం వల్ల వీళ్లందరికీ జైల్లో నుంచి విముక్తి లభిస్తుందని అధికారులు చెబుతున్నారు.